Site icon NTV Telugu

SLBC Tragedy: మధ్యాహ్నంలోగా మృతదేహాల వెలికితీత పూర్తి.. డీఎన్ఏ టెస్టుల తర్వాత బంధువులకు అప్పగింత

Slbc2

Slbc2

తెలంగాణలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్‌లో మధ్యాహ్నంలోపు మృతదేహాల వెలికితీ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మృతదేహాలను నేరుగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ఇందుకోసం అంబులెన్స్‌లు కూడా సిద్ధం చేశారు. దాదాపు 8 రోజులు కావడంతో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. దీంతో గాంధీ ఆస్పత్రి తరలించి డీఎన్‌ఏ టెస్ట్‌లు తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే రెస్క్యూ టీమ్స్.. మూడు మృతదేహాలను వెలికితీశారు.

ఇది కూడా చదవండి: Movies In March 2025: మార్చి నెలలో థియేటర్స్‌లో సందడి చేయనున్న సినిమాల లిస్ట్ ఇదిగో!

ఇక ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ దగ్గరకు జేపీ కంపెనీ చైర్మన్, అడ్మినిస్ట్రేషన్ ముఖ్యులు చేరుకున్నారు. మరి కాసేపట్లో మృతుల కుటుంబాలకు పరిహారం, ఇన్స్యూరెన్స్ విషయంలో స్పష్టత రానుంది. టెస్టుల తర్వాత మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు అంబులెన్స్‌లను కూడా అధికారులు సిద్ధం చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా టన్నెల్ దగ్గరకు చేరుకోనున్నారు. సాయంత్రంలోగా రెస్క్యూ పూర్తయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Bhupalapally: ప్రతాపగిరి అడవుల్లో పెద్దపులి సంచారం.. భయాందోళనలో ప్రజలు

Exit mobile version