Reactor Blast in Sangareddy: సీఎంహెచ్ ఫ్యాక్టరీలో రియాక్టర్ బ్లాస్ట్.. 15 మంది కార్మికులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reactor Blast in Sangareddy: సంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో ఉన్న సీఎంహెచ్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది. అదే సమయంలో పరిశ్రమలో 15 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఆ పరిశ్రమతో పాటు పక్కనే ఉన్న వనమాలి ఫార్మా పరిశ్రమకు కూడా మంటలు వ్యాపించడంతో రెండు పరిశ్రమల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో పరిశ్రమలో పనిచేస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఇస్నాపూర్‌లోని కాకతీయ ఆస్పత్రికి, పటాన్‌చెరులోని పోలార్ ఆస్పత్రికి తరలించారు.
Read also: KTR Vs Rajagopal Reddy: అహంకారం తగ్గించుకో.. కేటీఆర్ పై రాజగోపాల్ రెడ్డి ఫైర్
Also Read
రియాక్టర్ పేలుడు సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే స్పందించి ఘటనాస్థలికి చేరుకున్నారు. రెండు కర్మాగారాల్లో మంటలు వ్యాపించడంతో సీనియర్ అగ్నిమాపక అధికారుల ఆదేశాల మేరకు పటాన్చెరు, సంగారెడ్డి, సదాశివపేట, బీహెచ్ఈఎల్ నుంచి అగ్నిమాపక యంత్రాలను పంపించారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలను అదుపు చేసేందుకు సహకరించిన కార్మికులు రసాయనాలు పీల్చి అస్వస్థతకు గురయ్యారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. గాయపడిన వారిని మోతు మాలిక్, దత్తు కులకర్ణి, కాలేషా పఠాన్, గోయదరావత్లుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఆర్డీఓ రవీందర్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదంపై ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Telangana Assembly: సచ్చినా పామును మళ్ళీ చంపుతాడా ఎవడన్నా.. కేసీఆర్ పై రేవంత్
తాజావార్తలు
-
Iran Oil: భారీ డిస్కౌంట్‌తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
-
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
-
CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్‌తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
DMK: స్టాలిన్‌కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్‌బై
ట్రెండింగ్
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!