కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులపై మాజీ మేయర్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యతకు నిబంధనలకు నీళ్లు వదిలారు.. స్మార్ట్ సిటీ పనుల నిర్వహణకు, ప్రభుత్వానికి సంబంధం ఉండదు.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయాలు తీసుకుంటారు.. డైరెక్టర్లలో జిల్లా కలెక్టర్ కూడా ఉంటారు అని ఆయన చెప్పారు. కలెక్టర్లకు తెలియకుండా ఏ పనులు జరగవు.. అందువల్లనే కలెక్టర్లు దృష్టి సారించలేదు.. రోడ్ల నిర్మాణంలో నాణ్యత గల ఇసుక వాడనందు వల్లనే కలెక్టరేట్ రోడ్డులో పగుళ్లు ఏర్పడుతున్నాయని మాజీ మేయర్ రవీందర్ సింగ్ తెలిపారు.
Read Also: Motorola Offers: మోటోరోలా బంపర్ ఆఫర్.. ఆ ఫోన్లపై రూ 10 వేల డిస్కౌంట్!
ఈ పనులు రికార్డు చేసేందుకే ప్రత్యేకంగా మున్సిపల్ లో కొంత మందికే బాధ్యత అప్పగించారు అని రవీందర్ సింగ్ చెప్పారు. స్మార్ట్ సిటీ పనులు కేవలం 50 డివిజన్లలో మాత్రమే చేపట్టాలి.. నిబంధనలకు విరుద్ధంగా బొమ్మకల్ పరిధిలో కూడా చేపట్టారు.. కొన్ని రోడ్లు వేయకుండానే బిల్లులు తీసుకున్నారు.. ఇప్పుడు విజిలెన్స్ విచారణ జరుగుతోంది కాబట్టి రాత్రి వేళల్లో రోడ్లు వేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. దీనిపై వెంటనే ప్రభుత్వంతో పాటు అధికారులు స్పందించకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని మాజీ మేయర్ రవీందర్ సింగ్ వెల్లడించారు.