Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. ఆస్పత్రిలో ఓ వ్యక్తి మృతదేహాన్ని ఎలుకలు కొరికేశాయి. ఈ విషయం బయటకు పొక్కకుండా సిబ్బంది ప్రయత్నించారు. ఇందుకోసం గుట్టుచప్పుడు కాకుండా పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే మృతదేహంపై ఎలుకలు కొరుకుతూ స్థానికులు ఫొటోలు తీయడంతో ఈవార్త వెలుగులోకి వచ్చింది. ప్రగతినగర్‌కు చెందిన పెరికల రవి అనే వ్యక్తి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. ఈ సమయంలో సిబ్బంది పట్టించుకుని చర్యలు తీసుకోకపోవడంతో మృతదేహాన్ని ఎలుకలు కొరికేశాయి. కొందరు దీనిని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం కుటుంబ సభ్యులు వచ్చి చూడగా ముఖం, బుగ్గలు, నుదుటిపై ఎలుకలు కొరికినట్లు గుర్తించారు. అయినా సిబ్బంది పట్టించుకోకుండా పోస్టుమార్టం నిర్వహించేందుకు యత్నించారనే విమర్శలున్నాయి. దీంతో వైద్యులపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read also: Wolf: ఇంజనీర్ కాస్త రూ.20 లక్షలు ఖర్చు చేసి.. తోడేలుగా మారిపోయాడు
ప్రభుత్వాసుపత్రిలో మృత దేహాల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రిలో ఎలుకలు సంచరిస్తున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోగుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఆసుపత్రుల్లో రోగులను ఎలుకలు కొరికేస్తున్న ఘటనలు గతంలో పలు ప్రభుత్వాసుపత్రుల్లో చోటు చేసుకున్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అధికారులు కొన్ని రోజులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత సిబ్బందిలో ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వాసుపత్రుల్లో కూడా ఎలుకలు కురిసి చిన్నారులు చనిపోతున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఆస్పత్రుల్లో ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
Wolf: ఇంజనీర్ కాస్త రూ.20 లక్షలు ఖర్చు చేసి.. తోడేలుగా మారిపోయాడు