Wolf: ఇంజనీర్ కాస్త రూ.20 లక్షలు ఖర్చు చేసి.. తోడేలుగా మారిపోయాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wolf: పుర్రె కో బుద్ధి జిహ్వకో రుచి అన్న సామెత గుర్తుండే ఉంటుంది. ప్రతి మనిషికి ఓ కల ఉంటుంది. జీవితంలో నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలాంటిదే ఓ ఇంజనీర్ తన చిన్న నాటి కల నెరవేర్చుకున్నారు. అందుకు అతడు రూ. 20 లక్షలు ఖర్చు చేశాడు. కానీ అది దేనికో తెలిస్తే ఆశ్చర్యపోతారు. జపాన్‌కు చెందిన 32 ఏళ్ల ఇంజనీర్ చిన్నప్పటి నుండి జంతువుగా మారాలని కోరుకున్నాడు. ఇప్పుడు తోడేలు కాస్ట్యూమ్ రెడీ చేసుకున్నాడు. అది వేసుకున్నాక కష్టాలన్నీ మర్చిపోతానని అంటున్నాడు.
ఇటీవల కాలంలో అదే జపాన్‌లో ఓ వ్యక్తి కుక్క కావాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. ఈ కల కోసం రూ.12 లక్షలు వెచ్చించాడు. ఇప్పుడు జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి అతని కంటే రెండడుగులు ముందుకు వేశాడు. జపాన్ యువకుడి కల తోడేలుగా మారడం. ఎట్టకేలకు అతని కల నెరవేరింది. 20 లక్షలు వెచ్చించి.. వేసుకున్న తర్వాత సరిగ్గా తోడేలులా కనిపించేలా కాస్ట్యూమ్‌ని సిద్ధం చేసుకున్నాడు. విచిత్రమైన అభిరుచి ఉన్న వ్యక్తి పేరు తోరు ఉడ.. అతను వృత్తిరీత్యా ఇంజనీర్. ఈ సంవత్సరం ప్రారంభంలో అతను తన అభిమాన సూట్‌ను పొందాడు. దానిని ధరించి ఫోటోషూట్ కూడా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Also Read
- Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
Read Also:Suriya S/o Krishnan: మరో మూడు రోజుల్లో మ్యూజికల్ కాన్సర్ట్…
సినిమా, టీవీ పరిశ్రమకు కాస్ట్యూమ్‌లను అందించే మోడలింగ్ కంపెనీ అయిన జెపెట్ వర్క్‌షాప్ దీనిని రూపొందించింది. 32 ఏళ్ల ఇంజనీర్ ఇంట్లో కూడా ఈ సూట్ ధరించడం సౌకర్యంగా ఉందని చెప్పారు. తోడేలుగా మారిన తర్వాత కష్టాలన్నీ మరిచిపోయాను అన్నారు. యూకే మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత తాను మనిషిని కానని అనిపిస్తోంది. మానవ సంబంధాలు, కష్టాలు, పని ఒత్తిడి అన్నీ మర్చిపోయినట్లు చెప్పాడు.
ఈ సూట్ వేసుకున్నాక మంచి అనుభూతిని పొందుతానని, స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నానని చెప్పాడు. అద్దంలో చూసుకుంటే తోడేలులా కనిపిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నాడు. తాను ప్రమాదకరమైన తోడేలుగా మారను. తాను ఆకతాయిని కాదన్నాడు. సూట్ వేసుకున్న తర్వాత కదలడానికి కూడా సౌకర్యంగా ఉందన్నాడు. ఈ కంపెనీ జపాన్ వ్యక్తి కోసం కుక్క దుస్తులను కూడా సిద్ధం చేసింది. ఆ మనిషికి కూడా చిన్నప్పటి నుంచి కుక్కలా కనిపించడం అంటే చాలా ఇష్టం. ఆ కాస్ట్యూమ్ వేసుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కూడా ప్రపంచవ్యాప్తంగా బాగా నచ్చింది.
Read Also:Jio 3GB Recharge Plans: రిలయన్స్ జియో స్పెషల్ ప్లాన్స్.. ప్రతిరోజూ 3జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!
తాజావార్తలు
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
-
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?