CM Revanth Reddy : తెలంగాణలో రేషన్ కార్డు కేవలం సరుకులు అందించే పత్రం మాత్రమే కాకుండా, అది పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో నిర్వహించిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం పట్ల తన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రేషన్ కార్డు పేదవాడి గుర్తింపు అని, ఆకలి తీరేందుకు ఉపయోగపడే ఆయుధమన్నారు. కానీ గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ విషయం తెలుసనిపించలేదని ఆయన వ్యాఖ్యానించారు. వారి పాలనలో రేషన్ కార్డులు మంజూరు చేయడం, సన్నబియ్యం అందించడం అనే అంశాలు వెనుకబడ్డాయని ఆయన అన్నారు.
Kriti Sanon : బాయ్ ఫ్రెండ్ తో ప్రభాస్ హీరోయిన్.. లండన్ లో చెక్కర్లు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే రాష్ట్రవ్యాప్తంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందించామని తెలిపారు. “ప్రజలకు అవసరమైన పథకాలను అమలు చేస్తుంటే, రేషన్ షాపుల వద్ద బారులు తీరుతున్నాయి. ఇది మాకు గర్వకారణం,” అని అన్నారు.
రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం వ్యవసాయాన్ని పండగగా మలుస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. “గిట్టుబాటు ధరతో పాటు బోనస్ అందిస్తున్నాం. దేశం మొత్తం నోరు తీసేలా తెలంగాణ వరి ఉత్పత్తిలో ముందు నిలుస్తోంది,” అని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలపై కూడా ఈ సందర్భంగా రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. “గతంలో అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నీటిని తుంగతుర్తికి తేవలేకపోయిన వారు, ఇప్పుడు మన ప్రభుత్వం ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అంటున్నారు. వారు గతంలో మూడు రోజులు సమయం ఇవ్వండి, నీళ్లు తెస్తాం అన్నారు. కానీ పదేళ్లు అధికారంలో ఉన్నా నీటి తాలూకూ కనిపించలేదు,” అని ఎద్దేవా చేశారు.
Telangana High Court : తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్
