Site icon NTV Telugu

Warangal Crime: ఇంట్లో గొడవ పడి బయటకు వెళ్లింది.. లైంగిక దాడికి గురైంది

Gang Rape

Gang Rape

Warangal Crime: ఇంట్లో గొడవ పడింది. కుటుంబ సభ్యులను కాదని బయటకు వచ్చింది. కానీ ఆమె ఆ అర్థరాత్రి బయటకు రావడం గమనించిన కొందరు వ్యక్తులు ఇదే అలుసుగా తీసుకున్నారు. బాధలో వున్న ఆమెను తీసుకువెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశారు. ఈ ఘటన కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమారం చెరువు శివారులో జరిగింది. హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Rashmi gautam: పబ్ లో రచ్చ చేసిన రష్మి

కిషన్‌పురానికి చెందిన హనుమకొండ అనే వివాహిత 27వ తేదీ అర్ధరాత్రి ఇంట్లో గొడవ జరగడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. హనుమకొండ నయీంనగర్‌ రాంగ్‌బార్‌ రోడ్డుపైనే ఉంది. అదే సమయంలో కేయూసీ వైపు వెళ్తున్న భీమారానికి చెందిన ఆటోడ్రైవర్ రాకేష్ రోడ్డుపై నిల్చున్న వివాహితను చూశాడు. ఆమె వెంట ఎవరులేరని గమనించి ఆమె వద్దకు వెళ్లి ఆటోను ఆపాడు. ఎక్కడి వెళ్లాలని ప్రశ్నించాడు. అయితే ఆమె డ్రైవర్ తో ఏమీ మాట్లాడలేదు. ఏమైంది అంటూ మాటలు కలుపుతూ బలవంతంగా ఆమెను ఆటోలో ఎక్కించాడు.డ్రైవింగ్ చేస్తూ భీమారానికి చెందిన తన స్నేహితులు సతీష్, సనత్ లకు ఫోన్ లో సమాచారం అందించాడు. కేయూసీ క్రాస్‌ రోడ్డు వద్దకు రాగానే ఇద్దరినీ ఆటోలో ఎక్కించుకుని చెరువు శివార్లలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం మత్తులో ముగ్గురు కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ కిరాతకుల నుంచి తప్పించుకున్న బాధితురాలు హనుమకొండ పోలీస్టేషన్ కు చేరుకుంది. తనకు జరిగిన అన్యాయం గురించి వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్ అనే ఆటోడ్రైవర్‌ను అరెస్టు చేశారు. అతనితో పాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
Chennai Customs : దీని దుంప తెగ.. లగేజీ నిండా భయంకరమైన పాములు

Exit mobile version