NTV Telugu Site icon

Fire Accident: కొందుర్గులోని స్కాన్‌ ఎనర్జీ పరిశ్రమలో భారీ పేలుడు.. ముగ్గురి పరిస్థితి విషమం

Fire Accident

Fire Accident

రంగారెడ్డి జిల్లా కొందుర్గులోని స్కాన్‌ ఎనర్జీ ఐరన్ పరిశ్రమలో భారీ పేలుడు ప్రమాదం జరిగింది. పేలుడు దాటికి చిన్న భవనం కుప్పకూలిపోయింది. అంతేకాకుండా.. ఫ్యాక్టరీలోని రేకులు మొత్తం చెల్లాచెదురు అయ్యాయి. అయితే కొంతమంది కార్మికులు పనిచేస్తుండగా వారిపై వేడి ద్రవం పడినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు కార్మికులకు తీవ్రగాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం షాద్ నగర్ ఆస్పత్రికి తరలించారు.

Read Also: Rohit Sharma: రెండు రోజుల ముందే వెళ్తాం.. అప్పుడు మేం చేసేదేముంటుంది?: రోహిత్ శర్మ

మరోవైపు.. ఒక్కసారిగా పేలుడు జరగడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. అనంతరం అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించడంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే.. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా లేదా అనేది అధికారులు గాలిస్తున్నారు. పేలుడు ధాటికి షెడ్‌ కుప్పకూలిపోయింది. అంతేకాకుండా.. పరిశ్రమ మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read Also: K Viswanath: కె.విశ్వనాథ్ వర్ధంతి.. ఆయన పేరుతో అవార్డులు ప్రకటించిన ఫ్యామిలీ