Site icon NTV Telugu

BRS Dharna: కందుకూరులో బీఆర్‌ఎస్‌ భారీ ధర్నా.. హాజరుకానున్న కేటీఆర్‌..

Ktr

Ktr

BRS Dharna: నేడు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నారు. అర్హులైన రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టానున్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ ధర్నాలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తోపాటు పలువురు నాయకులు పాల్గొంటారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ధర్నా ఏర్పాట్లను పార్టీ నేతలతో చర్చించారు. అధికారం కోసం తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమవుతుందని మండిపడ్డారు. రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిగా అమలయ్యే వరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కందుకూరులో బీఆర్ఎస్ ధర్నా నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.

Read also: Devara 2 : దేవర 2 ప్లానింగ్ అంతా మార్చేసిన కొరటాల

రైతులు పండించిన దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలని నిన్న జరిగిన సమావేశంలో కేటీఆర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కేవలం సన్న వడ్లకే 500 రూపాయలు బోనస్ అని ప్రకటించడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి అన్నారు. మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షా 50 వేల కోట్లు అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రైతు భరోసాకి, దొడ్డు వడ్ల బోనస్ కు పైసలు లేవా అని ప్రశ్నించారు. లక్షలాది మంది రైతులకు పంగనామాలు పెడతామంటే ఊరుకోం.. వానాకాలం సీజన్ పూర్తి అవుతున్న రైతు భరోసా ఊసేలేదు అని కేటీఆర్ మండిపడ్డారు.
Bathukamma Tangedu Flowers: బతుకమ్మ పండుగకు తంగేడు పువ్వులకు సంబంధం ఏమిటి?

Exit mobile version