Bathukamma Tangedu Flowers: బతుకమ్మ పండుగకు తంగేడు పువ్వులకు సంబంధం ఏమిటి?
- తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులకు అతి పెద్ద పండగ బతుకమ్మా..
- బతుకమ్మ పండుగ వెనుక చాలా కథలు వెలుగులోకి..
- వాటిలో ఓ కథ తంగేడు పూలతో బతుకమ్మకు ఉన్న అనుబంధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bathukamma Tangedu Flowers: తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులకు అతి పెద్ద పండగ బతుకమ్మా.. ఈ బతుకమ్మా పండుగకు రాష్ట్రమంతా సందడిగా ఉంటుంది. ప్రతి ఇంట్లో బతుకమ్మలు రంగు రంగు పూలతో గుభాళిస్తాయి. ఆటపాటలతో బతుకమ్మను ఆడబిడ్డాలు కొలుచుకుంటూ తమ కుటుంబాలను చల్లగా చూడమ్మా అని దీవించమని వేడుకునేదే ఈ బతుకమమ్మ పండుగ.. తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రానికే ఈ బతుకమ్మ పండుగ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మొత్తం తొమ్మిది రోజుల పాటు.. తెలంగాణ ఆడబిడ్డలు తొమ్మిది పేర్లతో బతుకమ్మను పూజిస్తారు. ఈ బతుకమ్మను పేర్చటంలో తంగేడు పూలు వెరీ వెరీ స్పెషల్.. పసుపు రంగులో చూడగానే ఆకర్షణగా కనిపిస్తుంది. అయితే, బతుకమ్మ పండుగ వెనుక చాలా కథలు వెలుగులో ఉన్నాయి. వాటిలో ఓ కథ తంగేడు పూలతో బతుకమ్మకు ఉన్న అనుబంధం గురించి తెలుసుకుందాం.
Also Read
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
- Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
తంగేడి పూలతో ఓ అన్న-చెల్లి కథ..
పూర్వకాలంలో ఏడుగురు అన్నదమ్ములకు ఒకే ఒక్క చెల్లెలు ఉండేది. ఆ చెల్లెలంటే ఏడుగురికి చాలా ఇష్టం.. తమ ముద్దుల చెల్లికి చిన్న దెబ్బ తగిలినా వాళ్లు విలవిల్లాడిపోయేవారు. చెల్లిని అంత ప్రాణంగా చూసుకోవటం అన్నల భార్యలకు ఇష్టముండేది కాదు.. దీంతో ఆడబిడ్డ అంటే ఆ ఏడుగురు అన్నదమ్ముల్ల భార్యలు అసూయపడేవారు. అన్నలు ఎక్కడికెళ్లినా చెల్లెలి కోసం స్పెషల్ గా గిఫ్ట్ లు తీసుకొచ్చేవారు.. దాంతో వదినలకు ఆడబిడ్డ అంటేనే గిట్టేది కాదు.. కానీ భర్తలకు భయపడి వాళ్లు సైలెంట్ గా ఉండేవారు. ఇలా అన్నల ప్రేమాభిమానాలతో చెల్లెలు సంతోషంగా జీవిస్తుంటే ఆడబిడ్డను చూసి ఈర్ష అసూయ ద్వేషాలతో వదినల మనస్సు మండిపోయేది. ఆమెను ఎలాగైనా వదిలించుకుంటేనే తమకు మనశ్శాంతి లభిస్తుంది అనుకున్నారు. అందుకు తగిన సమయం కోసం వేచి చూసేవారు. ఈక్రమంలో ఓ రోజు అన్నలు వేటకెళ్లారు.
Read Also: Crime News: మద్యం మత్తులో ప్రియురాలిని చంపిన ప్రియుడు
తమ భర్తలు ఎంతకీ తిరిగి రాకపోవడంతో వారికి ఓ చెడు ఆలోచన వచ్చింది. ఇదే సమయం తమ ఆడబిడ్డను వదిలించుకోవటానికి అనువైన సమయం అనుకున్నారు. తోటి కోడళ్లంతా కలిసి సదరు ఆడబిడ్డను ప్రతీ చిన్న విషయానికి తిట్టేవారు.. అలా ఆమెను చంపేసి ఊరి బయట పాతి పెట్టారు. దీంతో ఆ ఆడబిడ్డా అడవి తంగేడు చెట్టుగా పుట్టి విరగబూసింది. ఇక, ఊరికి వెళ్లి వచ్చిన అన్నలు తమ చెల్లెలుకు ఎప్పటిలాగే బహుమతులు తీసుకొచ్చారు. ఇంటికి రాగానే భార్యాల్ని అడిగారు.. దీంతో వారంతా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అన్నదమ్ములందరికి సందేహం వచ్చింది. చెల్లెల్ని వెతుక్కుంటు ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. అలా తిరిగి తిరిగి ఓ చోట కూర్చొని చెల్లెలి గురించి మాట్లాడుకుంటూ.. బాధపడుతుంటే. అది విన్న వారి చెల్లెలు.. అన్నదమ్ములు తన కోసం పడుతున్న బాధల్ని చూడలేని ఆ చెల్లెలు తంగేడు మొక్క రూపంలో తన మరణం గురించి వారికి చెప్పింది.. అప్పుడు ఆ అన్నలు చెల్లెలికి ఏం కావాలో కోరుకొమ్మని అడుగగా ఈ తంగేడు పూలలో తనను చూసుకోమని, ప్రతి ఏటా బతుకమ్మ పేరుతో పండగ చేయమని చెప్పిందట.. అలా ఈ బతుకమ్మ పండుగ ప్రారంభమైంది అనే నానుడి ఉంది.
OG : “ఓజి” ఇండస్ట్రీ హిట్ ఖాయం.. ఇది కదా కాన్ఫిడెన్స్
తాజావార్తలు
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!