Site icon NTV Telugu

కేంద్రం మీద నెపం నెట్టి.. గిరిజన ఓట్లు లాక్కునేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నం: రాములునాయక్‌

కేంద్రం మీద నెపం నెట్టి గిరిజన ఓట్లు లాక్కునేందుకు టీఆర్‌ఎస్‌ ప్రయత్నం చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గిరిజనుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్‌ఎస్‌కు లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ వెన్నంటే ఉన్నది గిరిజనులేనన్నారు. తెలంగాణ వచ్చిన మరునాడే గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తా అన్న కేసీఆర్ ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయడం లేదన్నారు.

Read Also: మరిన్ని రైళ్లలో జనరల్‌ టిక్కెట్లు పెంచే యోచనలో రైల్వే శాఖ

సత్యవతి రాథోడ్‌కు ఏం తెలియదు. చెన్నప్ప కమిటీ రిపోర్ట్‌ను ఎందుకు బయటపెట్టడం లేదో చెప్పాలన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి గిరిజనులతో ఏం సంబంధం ఉందని ప్రెస్‌మీట్‌లో కూర్చున్నారని ప్రశ్నించారు. ఉద్యోగాల గురించి పల్లా ఎందుకు మాట్లాడటం లేదంటూ రాములు నాయక్‌ ఫైర్‌ అయ్యారు. ఎంపీ కవిత పార్లమెంట్ లో గిరిజన రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదో ప్రజలకు చెప్పాలన్నారు. బంజారా భవన్‌ ఇంకా ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు.సేవాలాల్ జయంతి ని సెలవుదినం గా ప్రకటించాలని రాములు నాయక్‌ డిమాండ్‌ చేశారు.

Exit mobile version