Secunderabad Deccan Mall Fire: సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేటలోని డెక్కన్ నైట్ వేర్ దుకాణంలో రెండు రోజులు గడుస్తున్నా మంటలు అదుపులోకి రాలేదు. నిన్నటి నుంచి ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్న మంటలు అదుపులోకి రావడం లేదు. నిన్న మధ్యాహ్నం ఒక్కసారిగా డెక్కన్ నైట్ వేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో.. షాప్ యజమాని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాడు. హుటా హుటిన అక్కడకు చేరుకున్న సిబ్బంది. మంటలను అదుపులో తెచ్చేందుకు సాయశక్తుల ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే మంటలు షార్ట్ సెక్యూర్ట్ వల్ల సంభవించాయని తేల్చారు. కాగా.. భారీగా మంటలు చెలరేగడంతో.. మంటలు కొందరు చిక్కుకున్నారు. వారిలో ముగ్గురిని కాపాడారు. మరో వైపు భవనంలో ముగ్గురు చిక్కుకున్నట్లు దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దాదాపు 40కిపైగా ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన ఇంకా రెండురోజు మంటలు అదుపులోకి రాలేదు. దక్కన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవనం అంతా పూర్తీగా దగ్ధం మయ్యింది. మంటల వేడికి పిల్లర్లు పూర్తీగా దెబ్బతిన్నాయి. దీంతో పిల్లర్ల సపోర్ట్ తో ముందు భాగం ఉన్న భవనం ఏ క్షణంలో అయినా కూలిపోయే అవకాశం ఉంది. మంటల వేడికి పిల్లర్లు, స్లాబ్ లోని ఐరన్ కరిగిపోయాయి. దీంతో భవనం ఏక్షణంలోనైనా కూలిపోయే స్థితిలో వున్నందున అపార్ట్మెంట్ వాసులు, స్థానిక బస్తీ వాసులు బిక్కు బిక్కు మంటు గడుపుతున్నారు.
Read also: Anant Radhika Engagement: వైభవంగా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ నిశ్చితార్థం
కేసు నమోదు..
డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదం పై కేసు నమోదు చేశారు పోలీసులు. కానిస్టేబుల్ బలప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నలుగురిని రెస్క్యూ చేసినట్లు ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్న పోలీసులు. మరో ముగ్గురు వసీం, జునైద్, జహీర్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నల్లటి దట్టమైన పొగ, ఎగిసిపడుతున్న మంటలతో ముగ్గురినీ గుర్తించలేకపోయామన్నారు. ప్రమాదానికి భవన్ యజమాని మహమ్మద్ ఓవైసీ, ఎంఏ రహీంలు కారణమని గుర్తించి వీళ్ళ పై కేసు నమోదు చేశామన్నారు. భవనానికి సెట్ బ్యాక్ లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. రాంగోపాల్ పేట్ ఫైర్ యాక్సిడెంట్ లో ఇద్దరు ఫైర్ సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. ఏడిఎఫ్ఓ ధనుంజయ రెడ్డి తో పాటు ఫైర్ ఇంజన్ డ్రైవర్ నర్సింగరావులు కూడా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఏడిఎఫ్ఓ, డ్రైవర్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ నరసింహారావు పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్ పైన డ్రైవర్ నర్సింగ్ రావు వున్నట్లు సమాచారం.
వెంటిలేటర్ పై ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు.
Read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
రెండు సార్లు పరీశీలించిన మంత్రి తలసాని..
అగ్నిప్రమాదం ఘటన బిల్డింగ్ దగ్గరకు మంత్రి తలసాని యాదవ్ రెండు సార్లు వెళ్లి పరీశీలించారు. ఇవాళ ఉదయం భవనాన్ని కూల్చివేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు తలసాని. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం అందుతుందని, అన్ని ఫైర్ తో పాటు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ప్రయత్నం చేశాయన్నారు. ఈ ఫైర్ యాక్సిడెంట్ వలన బస్తి వాసులు ఇబ్బందులు పడుతున్నారని, అందులో కెమికల్స్ ఉండడం వల్ల ఈ స్థాయిలో నష్టం జరిగి జరిగిందని పేర్కొన్నారు. బిల్డింగ్ వెనకాల ఉన్న ఇండ్లలోని వ్యక్తులను ఖాళీ చేయించామన్నారు. మధ్యాహ్నం రాత్రి భోజనాలు ఏర్పాటు చేశామన్నారు. వచ్చే గురువారం లేదా శుక్రవారం ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ రోజు రోజుకి భారీగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. ఇచ్చిన అనుమతులు ఒకటి అక్రమంగా ఆక్రమించుకొని కట్టడాలు కట్టారని మండిపడ్డారు. చాలా బిల్డింగ్ లోకి ఎన్నో సీలు సైతం లేవు, అలాంటి వాటిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జనావాసాల మధ్య ఇలాంటి లేకుండా దూరంగా ఉంటే ఎలా ఉంటుందని దానిపైన కూడా చర్చ చేస్తామన్నారు. నాలలాల పైన కూడా అక్రమనలు వచ్చాయి.. వాటిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నా మంత్రి తలసాని. ఈ భవనాన్ని కూల్చివేయాలంటూ మంత్రి తలసాని ఆదేశాలు జారీచేశారు. జీహెచ్ఎంసి ప్రణాళికా విభాగానికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. జేఎన్టీయూ కు చెందిన నిపుణుల కమిటీ ఇవాళ ఈ భవనాన్ని పరిశీలించనుంది. ఇవాళ తలసాని, జీహెచ్‌ఎంసీ అధికారులు ఘటనాస్థలానికి పరీశీలించి, అగ్నిప్రమాదానికి గురైనా భవనాన్ని కూల్చివేతలకు ఏర్పాటు చేపట్టారు.
Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..