Site icon NTV Telugu

Ramesh Babu : చెన్నమనేని రమేశ్‌బాబుకు నోటీసు.. ఓటర్ల జాబితాలో నుండి పేరు తొలగింపు ప్రక్రియ ప్రారంభం

Chennamaneni Ramesh

Chennamaneni Ramesh

Ramesh Babu : వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు సంబంధించి ఓటర్ల జాబితా నుండి పేరును తొలగించేందుకు ఎన్నికల అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు వేములవాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయం గురువారం అధికారిక నోటీసు జారీ చేసింది. నోటీసును ఆయన నివాసమైన వేములవాడలోని ఇంటి గోడపై అతికించారు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా బాధ్యత వహిస్తున్న రెవెన్యూ డివిజనల్ అధికారి జారీ చేసిన నోటీసులో, రమేశ్‌బాబు భారతీయ పౌరుడు కాదని, ఆయనకు జర్మన్ పౌరసత్వం ఉందని హైకోర్టు నిర్ణయించిన తీర్పును ఉదహరించారు.

Coolie : ‘కూలీ’ హిందీ టైటిల్ వివాదం సద్దుమణిగింది

అదే ఆధారంగా ఫారం-7 ప్రకారం ఆయన పేరు తొలగించనున్నట్లు పేర్కొన్నారు. పేరు తొలగింపుపై ఎలాంటి అభ్యంతరాలుంటే, వాటిని జూలై 2వ తేదీలోగా అధికారులకు తెలియజేయాల్సిందిగా నోటీసులో సూచించారు. ఎన్నికల చట్టం ప్రకారం, ఇతర దేశపు పౌరులు భారత ఓటర్ల జాబితాలో ఉండరాదన్న నిబంధనలను అనుసరిస్తూ ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

Tragedy: గురుగ్రామ్‌లో విషాదం.. సివిల్ ఇంజినీర్ నిర్లక్ష్యం లా విద్యార్థి ప్రాణం తీసింది

Exit mobile version