Agnipath Protest: రాకేశ్ అంతిమ యాత్రలో ఉద్రిక్తత.. రాళ్ళదాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళనలు జరిగాయి. ఇందులో భాగంగా దాడులు జరిగిన విషయం తెలిసిందే. దాడుల నేపథ్యంలో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో వరంగల్‌కు చెందిన రాకేశ్ మృతిచెందాడు. వరంగల్ ఎంజీఎం నుంచి స్వగ్రామానికి శనివారం ఉదయం రాకేశ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతిమ యాత్ర కొనసాగుతుండగా ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. అంతిమ యాత్రలో పాల్గొన్న ఆందోళనకారులు.. ఒక్కసారిగి వరంగల్‌లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. నల్లజెండాలతో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం బోర్డుకి నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. పోచం మైదాన్ కూడలి మీదుగా రాకేశ్ అంతిమ యాత్ర సాగుతోంది.
కాగా… సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆందోళనలో మృతి చెందిన ఆర్మీ అభ్యర్థి రాకేష్ మృతదేహం ఉదయం వరంగల్ ఎంజీఎంకు చేరుకుంది. ఎంజీఎం మార్చురీలో మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం రాకేష్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. భారీ బందోబస్తు మధ్య అంతిమ యాత్ర కొనసాగుతోంది. అంతిమ యాత్రలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, వామపక్షపార్టీల నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఖానాపూర్ మండలంలో దబీర్ పేట గ్రామంలో రాకేశ్ అంత్యక్రియలు పూర్తవుతాయి.
Also Read
తాజావార్తలు
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్‌కు చుక్కలే.. రిషభ్ పంత్‌కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..