బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం ఎమ్మెల్యే రాజాసింగ్ అధ్యక్షతన సోమవారం జరిగింది.ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌పై విమర్శలు సంధించారు. ప్రధానంగా హుజురాబాద్ ఉప ఎన్నికపైనే ఈ సమావేశం జరిగినట్టు ఆయన వివరించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయ త్నాలు కేసీఆర్ చేశారన్నారు. సర్వేల ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాజాసింగ్ విమర్శించారు. కేసీఆర్ ఎన్ని సర్వేలు చేయించుకున్నా బీజేపీ గెలుస్తుందని రిపోర్ట్ రావడంతో చివరకు డబ్బులు పంచి గెలవాలని చూశాడని రాజాసింగ్ అన్నారు.
కేసీఆర్ ఎన్నికుట్రలు చేసిన అక్కడ ప్రజలు టీఆర్‌ఎస్‌ను కాదని ఈటలకే ఓటు వేశారన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. తెలంగాణ లో 2 లక్షల ఖాళీలు ఉన్నా ఒక్క నోటిఫికేషన్ వేయకపోవడం దారుణమన్నారు. నిరుద్యోగుల కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. ఈనెల 21 నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామమ యాత్ర ఉంటుందని రాజా సింగ్ తెలిపారు.