Delhi High Court : ప్రభుత్వం 2018- 2020 మధ్య స్వాధీనం చేసుకున్న సుమారు 5 లక్షల కోట్ల రూపాయల విలువైన 70 వేల కిలోగ్రాముల హెరాయిన్ ఎక్కడ కనిపించకుండా పోయింది. ఇంతమొత్తంలో హెరాయిన్ రికార్డుల నుండి మాయం కావడం పై ఢిల్లీ హైకోర్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నోటీసు జారీ చేసింది. ఈ వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్.. 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఎన్‌సీఆర్‌బీని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 9న చేపట్టనుంది.
Read Also:Rajamouli : దర్శకుడు అనిల్ రావిపూడిపై ముసుగేసి గుద్దేస్తే 10వేలు ఇస్తా..
జర్నలిస్ట్ బీఆర్ అరవిందాక్షన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యను చేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని హోం మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరింది. అలాగే సీజ్ చేసిన డ్రగ్స్‌ను సీజ్ చేసిన విధానం, పారవేసేందుకు సంబంధించిన రికార్డులను అందజేయాలని ఆదేశించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికకు, 2018 – 2020 సంవత్సరాలలో హెరాయిన్ స్వాధీనం గురించి హోం మంత్రిత్వ శాఖ అందించిన డేటాకు మధ్య గణనీయమైన వ్యత్యాసాలు ఉన్నాయని పిటిషనర్ వాదించారు.
Read Also:Election Commission: తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. కానీ అక్కడ 4 గంటల వరకే..
5 లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ మాయం
2018 – 2020 మధ్య మొత్తంగా 70,772.544 కిలోల హెరాయిన్ స్వాధీనం రికార్డుల నుండి కనిపించకుండా పోయిందని పిటిషన్ పేర్కొంది. మాయమైన డ్రగ్స్ విలువ దాదాపు రూ.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఈ వ్యత్యాసం చాలా పెద్దదని, తక్షణం పరిష్కరించకపోతే సమాజంలో అరాచకానికి దారి తీస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయంలో సమాచారం, వివరణ కోసం తాను సాధ్యమైన ఫోరమ్‌లను ఉపయోగించానని, అయితే నేటికీ ప్రయోజనం లేదని పిటిషనర్ కోర్టులో పేర్కొన్నారు.