Site icon NTV Telugu

Raja Singh: భాగ్యలక్ష్మీ ఆలయంపై చేయివేస్తే నరికేస్తా..

Raja Singh

Raja Singh

తెలంగాణలో కొత్తగా భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం, చార్మినార్ వివాదం నడుస్తోంది. స్థానిక కాంగ్రెస్ లీడర్ రషీద్ ఖాన్ చార్మినార్ వద్ద నమాజ్ చేసుకోవడానికి అనుమతి కావాలంటూ సిగ్నేచర్ క్యాంపెయిన్ ప్రారంభించడం వివాదానికి కారణం అయింది. భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు జరుగుతున్నప్పుడు.. నమాజ్ కు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇది న్యాయపరమైన డిమాండ్ అని.. దీని కోసం సీఎం కేసీఆర్ ను కలుస్తా అని అన్నారు.

దీంతో బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే బండి సంజయ్ భాగ్యలక్ష్మీ ఆలయం మాకు ఎంతో ముఖ్యమని.. కొంతమంది కూల్చేయాలని, చేయివేయాలని చూస్తున్నారని ఖబద్దార్ అంటూ హెచ్చరించారు. చార్మినార్ కూల్చేయాలంటూ మేం ఎప్పుడూ డిమాండ్ చేయాలేదని.. ఓల్డ్ సిటీలోని ముస్లింలు డెవలప్ కావాలని కోరుకుంటున్నామని సంజయ్ అన్నారు. ఎంఐఎం పార్టీ ఆస్తులు కూడ బెట్టుకుంటున్నారని..ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారంటూ విమర్శించారు.

తాజాగా బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ వివాదంపై స్పందించారు. చార్మినార్ వద్ద సంతకాల సేకరణపై ఎమ్మెల్యే రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీద్ వద్ద మేము సంతకాలు తీసుకోవాలా.? అని ప్రశ్నించారు. ఇలా చేస్తే వాతావరణం దెబ్బతింటుందని అన్నారు. రషీద్ ఖాన్ మీద సుమోటగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చార్మినార్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని.. అటు నుంచి పెద్ద వాహనాలు వెళ్తే కూలిపోయే స్థితిలో ఉందని అన్నారు. రషీద్ ఖాన్ కు ఏమైనా సిగ్గుందా అని ప్రశ్నించారు. భాగ్యలక్ష్మి టెంపుల్ ను ముట్టుకుంటే చెయ్యి నరికేస్తా అని హెచ్చరించారు. రషిద్ ఖాన్ మసీద్ కు వెళ్లి ప్రార్థన చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. చార్మినార్ వద్ద సంతకాల సేకరణ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.

.

Exit mobile version