NTV Telugu Site icon

TS Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు

Talangana Rains

Talangana Rains

TS Rains: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఐదు రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు వంకలు ఏరులై పారుతున్నాయి. గాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది. రేపు (24)న దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేటి నుంచి 4 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మెదక్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, వరంగల్, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, వికారాబాద్, జంగం, సిద్దిపేట, హన్మకొండ, జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వెల్లడించారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.

Read also: CJI: సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేయోద్దు: సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ జంట జలాశయాల్లో నీటిమట్టం పెరుగుతోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లోకి ఇన్ ఫ్లో పెరుగుతోంది. హిమాయత్ సాగర్ జలాశయం నిండడంతో శనివారం మరో నాలుగు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూలై 21న జల్ బోర్డు అధికారులు శనివారం మొత్తం 6 గేట్ల ద్వారా 4120 క్యూసెక్కుల వరద నీటిని మూసీలోకి విడుదల చేశారు. ఉస్మాన్ సాగర్ జలాశయానికి 300 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 3.9 టీఎంసీలు. ప్రస్తుతం 2,980 టీఎంసీలు. దీని పూర్తి నీటి మట్టం 1790 అడుగులు. ప్రస్తుతం 1785.85 అడుగులుగా ఉంది.

Read also: Punjab: పోలీస్ స్టేషన్లో అవినీతికి వ్యతిరేకంగా రోడ్డుపై అడ్డంగా పడుకున్న హోంగార్డు.. వీడియో వైరల్

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లింక్ I బ్యారేజీల వరద గేట్లను ఎత్తివేశారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో విస్తరించి ఉన్న పరివాహక ప్రాంతం నుంచి గోదావరిలోకి వరద వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు.. ప్రస్తుతం 43 టీఎంసీల మార్కును దాటింది. గత 24 గంటల్లో ప్రాజెక్టు లైవ్ స్టోరేజీకి దాదాపు 8 టీఎంసీలు చేరాయి. వచ్చే వారం కూడా ఇదే స్థాయిలో ఇన్ ఫ్లోలు కొనసాగితే ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా మెరుగుపడుతుందని చీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా లక్షన్నర క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో వస్తోంది. నిజాం సాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 17.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.5 టీఎంసీలకు చేరింది.
Astrology : జులై 23, ఆదివారం దినఫలాలు