Rains : తెలంగాణలో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. నిర్మాల్, నిజమాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ 4 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. తెలంగాణలో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. Read Also…
Telangana Rains: తెలంగాణ రాష్ట్రం వైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వడగళ్ల వాన కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని తెలికపాటి నుంచి కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది.
Telangana Rains: ఆంధ్రప్రదేశ్ తీరంలోని కొమరెన్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు నిన్న తూర్పుగాలులకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన అల్పపీడనం నేడు బలహీనపడిందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు
Rain Alert: దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Telangana Rains: తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా అధికారులు ప్రకటించారు.
Telangana Rains: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అధికారులు వెల్లడించారు.
TS Rains: బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది. రేపు (24) దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.