Hyderabad Rains: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం.. మరో మూడు రోజులు వానలు
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం..
- మరో మూడు రోజులు వానలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Rains: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలోని సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, చిలకలగూడ, మారేడుపల్లి, సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, జగద్‌గిరిగుట్ట, దుండిగల్ తదితర ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. అదేవిధంగా మేడ్చల్, కృష్ణాపూర్, కండ్లకోయలో వర్షం కురుస్తోంది. నగరమంతా మేఘావృతమై ఉంది. ఇక రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా ఖమ్మం జిల్లా కొండమల్లేపల్లిలో 6.84 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా చందంపేటలో 5.91, నిడమనూరులో 4.45, గుండ్లపల్లిలో 4.98, పెద్దఅడిసర్లపల్లిలో 3.87, నాగర్‌కర్నూల్ జిల్లా పదరలో 4.19, ఉప్పనూటలో 4.16, రంగూరు జిల్లా మాడ్గులులో 3.88 సెం.మీ. 4.05 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ నెల నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది.
Nanebiyam Bathukamma: నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ.. ఏ నైవేద్యం సమర్పిస్తారు ?
Also Read
తాజావార్తలు
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
-
Donald Trump: “ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
-
Joseph Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
-
Japan Earthquake: జపాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!