Nanebiyam Bathukamma: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను తెలంగాణ ఆడపడుచులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పేర్లతో జరుపుకునే బతుమ్మ పండుగ నాలుగో రోజు వచ్చేసింది. నాలుగో రోజు బతుకమ్మ ‘నానేబియ్యం బతుకమ్మ’. ఈరోజు గౌరమ్మను తయారు చేసి, తంగేడును రకరకాల పూలతో అలంకరించి, వాయనంగా నానబెట్టిన బియ్యాన్ని బెల్లం లేదా చెక్కరతోకలిపి ముద్దలు చేసి పెడతారు. ఇది నాల్గవ రోజు నానేబియ్యం బతుకమ్మ ప్రత్యేకత.
Read also: Bathukamma Festival Secret: బతుకమ్మ పండుగ జరుపుకోవడం వెనుక రహస్యం..?
పండుగ సందర్భంగా సమర్పించే ప్రతి నివేదనలో ఒక అర్థం ఉంటుంది. బతుకమ్మ ఆడిన తర్వాత అందరికీ ప్రసాదం పంపిణీ చేస్తారు. ప్రసాదం అంటే పదిమందికి పంచడం. రాక్షస సంహారం కోసం తొమ్మిది రోజుల పాటు పోరాడి ఆకలితో జగన్మాత అలసిపోయి ఉంటుందనే భావనతో నాలుగో రోజు నానబెట్టిన బియ్యంతో నైవేద్యాలు సమర్పిస్తారు. బియ్యాన్ని కడిగి నానబెట్టి ఎండబెట్టి మెత్తని పిండిలా తయారుచేస్తారు. అందులో పాలు, పంచదార, నెయ్యి వేసి చిన్న చిన్న ఉండలుగా చేస్తారు. వీటిని పచ్చిపిండి ముద్దలు అని అంటారు. ఈ పచ్చిపిండి ముద్దులు అంటే అమ్మకు ఎంతో ఇష్టం. అందుకే నానబెట్టిన బియ్యంతో చేసిన వస్తువులను అమ్మకు సమర్పించారు.
Read also: TTD: టీటీడీ బోర్డు మెంబర్ గా టాలీవుడ్ నుండి ఎవరు..?
ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు చివరి రోజు అంటే సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులూ ఆడబిడ్డలు తంగేడు, గునుగు, కట్ల, బీర, గుమ్మడి, బంతి, చామంతి వంటి పూలతో బతుకమ్మను పేర్చి పండుగ జరుపుకుంటారు. బతుకమ్మను ఆటలు ఆడుతూ.. తెలంగాణ జానపద నృత్యాలు, పాటలు పాడుతూ ఆనందాలతో జరుపుకుంటారు. దశమి నవరాత్రుల ముందు రోజు ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలు అట్టహాసంగా జరుపుకుంటున్నారు. అక్కాచెల్లెళ్లంతా ఒకచోట చేరి ఆడిపాడుతూ పండుగను ఘనంగా జరుపుకుంటారు. వారి పాటలతో గౌరమ్మను కొలుస్తారు. తమ కష్టాలు చెప్పుకుంటారు. గౌరమ్మ ఆశీస్సులు తీసుకురావాలన్నారు.
BRS Dharna: కందుకూరులో బీఆర్‌ఎస్ భారీ ధర్నా.. హాజరుకానున్న కేటీఆర్..