Minister Uttam: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లో ఆదివాసి ప్రజా ప్రతినిధుల సాధికారత శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తండాల్లో సమస్యలు నాకు బాగా తెలుసు.. ఎంపీగా ఉన్నప్పుడు చాలా సార్లు పార్లమెంటులో ప్రస్తావించాను.. బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను నిర్వీర్యం చేసింది.. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి ఎవరు ఆపలేరు.. ఎస్సీ, ఎస్టీల కోసం 10 శాతం కంటే ఎక్కువ నిధులను బడ్జెట్లో కేటాయిస్తాం.. తండాలను గ్రామ పంచాయతీగా మార్చిన గత ప్రభుత్వం.. నిధులను మాత్రం విడుదల చేయలేదని ఆయన ఆరోపించారు. ప్రతి తండాలో గ్రామ పంచాయతీ భవనం, అంగన్వాడి స్కూల్, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాల, హాస్పిటల్ ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది.. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం అదే.. 2029లో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Health Tips : నాన్ వెజ్ పై నిమ్మరసం పిండి తింటున్నారా అయితే ఈ విషయం తెలుసుకోండి..
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీలను తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్న పార్టీ కాంగ్రెస్, నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివాసీలు కాంగ్రెస్ పార్టీకి ఆత్మీయులు.. ఆదివాసీల అభివృద్ధికి చట్టాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే.. రాహుల్ గాంధీ చొరవతోనే ఆదివాసి నేతల అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలు రూపొందించబడ్డాయని ఆయన చెప్పారు. భారతీయ జనతా పార్టీ దేశంలో రాష్ట్రంలో కుల, మత విభజనకు పాల్పడుతుంది అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.