The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise: టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. స్టార్ హీరోలు కూడా రొటీన్ కమర్షియల్ కథలకు భిన్నంగా కొత్తదనం చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో వచ్చిన కొన్ని సినిమాలను గమనిస్తే ఒక ఇంట్రెస్టింగ్ కామన్ పాయింట్ కనిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’, రామ్ చరణ్ ‘పెద్ది’, ఇప్పుడు నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాల్లో కథా ప్రపంచం వేరైనా.. హీరోలు మాత్రం గుర్తింపు కోసం చేసే పోరాటం సినిమాను పీక్స్ లోకి తీసుకెళ్తుంది. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్ర సమాజంలో తనకంటూ ఒక స్థానం, గౌరవం, గుర్తింపు సంపాదించుకోవాలనే తపనతో ముందుకు సాగుతుంది. తనను తక్కువగా చూసే వ్యవస్థను ఎదురించి తన స్థాయిని నిరూపించుకోవడమే ఆ పాత్ర ప్రయాణంలో కీలకంగా కనిపిస్తుంది. ఈ పాయింట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమాలో కూడా తన ఉనికి, తన ప్రజల గుర్తింపు కోసం పోరాటం అనే అంశం ప్రధానంగా కనిపించింది. అయితే ‘పెద్ది’ తన కథ, పాత్రల తీరుతో ప్రత్యేకమైన ప్రపంచాన్ని క్రియేట్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇప్పుడు నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’లోనూ ఇదే తరహాలో గుర్తింపు కోసం జరిగే పోరాటం ఉండబోతున్నట్లు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు. తనకోసం మాత్రమే కాకుండా తన ఊరు, తన ప్రజల ఉనికి కోసం పోరాడే కథానాయకుడిగా నాని కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘పుష్ప’, ‘పెద్ది’ తర్వాత అదే కోర్ ఐడియాతో మరో భారీ సినిమా వస్తోందనే చర్చ మొదలైంది. ఇక్కడ యాదృచ్ఛికంగా మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఆకట్టుకుంటోంది. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’.. ఈ మూడు సినిమాల పేర్లు కూడా ‘ప’ అక్షరంతోనే మొదలవుతున్నాయి. అంతేకాదు మూడు కథల్లోనూ తమ ఉనికి, గుర్తింపు కోసం పోరాటం అనే అంశం ఉండటంతో ఈ మూడు సినిమాల మధ్య ఒక కనెక్షన్ ఉందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. ఇప్పటికే ‘పుష్ప’, ‘పెద్ది’ తమదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించగా.. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని అభిమానులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 23 సాయంత్రం ప్రీమియర్ షోల తర్వాత ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో తెలియనుంది. అప్పటివరకు ‘పుష్ప–పెద్ది–ప్యారడైజ్’ మధ్య కనిపిస్తున్న ఈ కనెక్షన్ మాత్రం అభిమానుల చర్చల్లో కొనసాగుతూనే ఉంటుంది.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Tags
- cinema
- The Paradise
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!