NTV Telugu Site icon

Raghunandan Rao: ఆమ్నేషియా పబ్ కేసులో హోంమంత్రి మనవడే ప్రధాన సూత్రధారి

Raghunandan Rao 164339231716x9

Raghunandan Rao 164339231716x9

ఆమ్నేషియా పబ్ అమ్మాయిపై లైంగికదాడిలో సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. హోంమంత్రి మహమూద్ అలీ మనవడే ప్రధాన సూత్రధారి అని ఆరోపణలు చేశారు. పబ్ లో పార్టీ బుక్ చేసింది హోంమంత్రి మనవడే అని ఆరోపించారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అబ్బాయి, వక్ఫ్ బోర్డు పెద్దమనిషి కొడుకు, ఓల్డ్ సిటీ ప్రముఖ పత్రికా డైరెక్టర్ కొడుకుతో పాటు హోం మంత్రి పీఏగా చెప్పుకుంటున్న హరి సీసీ కెమెరా పుటేజీలో కనిపిస్తున్నారని.. కారు ఎవరిది, ఇన్నోవా ఎవరిదని ప్రశ్నించారు. ఈ కార్లను ఎందుకు సీజ్ చేయలేదని రఘునందన్ రావు ప్రశ్నించారు. సీసీ కెమెరా పుటేజీ మీ దగ్గర ఉందా.. డీజీపీ మహేందర్ రెడ్డి చెబితే బాగుంటుందని అన్నారు.

పథకం ప్రకారం హిందు అమ్మాయిలపై రజాకార్ల మనస్తత్వం కలిగిన ఎంఐఎం పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే హోంమంత్రిని తొలగించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎవరికైతే ఈ కేసుతో సంబంధం ఉందో వారందరిని శిక్షించాలని డిమాండ్ చేశారు. హోమంత్రిని ఉంటే పారదర్శకతంగా విచారణ జరగదని బీజేపీ తరుపున మేం భావిస్తున్నాం అని అన్నారు. మైనర్ అమ్మాయిలకు సంబంధించిన కేసులో విషయంలో సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ అనుగుణంగా విచారణ జరగాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

అయితే ఈ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. అత్యాచార వ్యవహారంలో నలుగురు నిందితులపై పోక్సో కేసును పెట్టారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని వైద్య పరీక్షలు పంపించారు. ఈ ఘటనలో బాలికను పబ్ కు తీసుకెళ్లిన హాడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హాడీని బురిడి కొట్టించి అమ్మాయిని కార్లో తీసుకెళ్లారని.. రెండు గంటల పాటు నలుగురు నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ తరువాత బాలికను పబ్ దగ్గర కార్లో దించారు. ఈ ఘటనకు సంబంధించి పబ్, బేకరీ సీసీ కెమెరా ఫులేజ్ ను పోలీసులు కలెక్ట్ చేశారు.