NTV Telugu Site icon

Raghunandan Rao: వరంగల్ సీపీ రెండ్రోజుల్లో మాట్లాడిన మాటల్లో తేడావుంది

Raghunandan Rao

Raghunandan Rao

Raghunandan Rao: వరంగల్ CP మొన్న మాట్లాడిన దానికి.. నిన్న మాట్లాడిన దానికి చాలా తేడా ఉందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ప్రధాని వర్చువల్ గా వర్చువల్ మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి కార్యక్రమంలో కిషన్ రెడ్డి, ఈటెల, ఇంద్రసేనారెడ్డి, రఘునందన్ రావు పాల్గొన్నారు. అనంతరం రాఘునందన్‌ రావు మాట్లాడుతూ.. బండి సంజయ్‌ అరెస్ట్‌తో ఆయన తీవ్రంగా మండిపడ్డా పడ్డారు. మంత్రులు మాట్లాడిన తీరు తల్లి దండ్రులకు భరోసా కల్పించకుండా వారికి ఆవేదన కలిగించిందని మండిపడ్డారు. రాజకీయ రంగు పులమాలని చూసారని కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు పోలీస్ లు సహకరించారని ఆరోపించారు. వరంగల్ CP మొన్న మాట్లాడిన దానికి నిన్న జరిగిన మాట్లాడిన దానికి చాలా తేడా ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. హిందీ పేపర్ ను పోటో తీసిన అతనికి బీజేపీ కి ఉన్న సంబందం ఏంది? పరీక్ష కేంద్రం వద్ద ఒక పోలీస్ కూడా లేడా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

Read also: Today Business Headlines 06-04-23: ఆర్బీఐ అనూహ్య నిర్ణయం. ‘వడ్డీ రేట్ల పెంపు’లో అంచనాలు తలకిందులు

శివ గణేష్ ఫోన్ నుండి ఎంత మందికి ఆ పేపర్ వెళ్ళింది? శివ గణేష్ ఫోన్ నీ సీజ్ చేశారా? రిమాండ్ రిపోర్ట్ లో పెట్టారా? అని ప్రశ్నలు గుప్పించారు. 9.37 నుండి బండి సంజయ్ ఫోన్ కు వచ్చే వరకు ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది ఎందుకు చెప్పడం లేదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్ పంపించారు కాబట్టి బండి సంజయ్ ముద్దాయి అయిండని, అధికార పార్టీ పేపర్ , ఛానల్ కి ఆ పేపర్ వెళ్లిందా? లేదా? సీపీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎంత మంది రాజకీయ నాయకులకు అది వెళ్ళింది చెప్పాలని అన్నారు. అందులో BRS, కాంగ్రెస్ వాళ్ళు ఎందరు ఉన్నారు? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మీ నోటి నుండి చెప్పించింది.. CP తొందర పడి అత్యుత్సాహంతో అధికార పార్టీ నీ సంతృప్తి పరచే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా, కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని తీవ్రంగా మండిపడ్డారు. పేరెంట్స్ రాజకీయాలు పట్టించుకోకుండా పరీక్ష కేంద్రాల వద్ద విజిలేంట్ గా ఉండాలని కోరుతున్నామని తెలిపారు. పోన్ డేటా రికవరీ చేయాలి అంటే సెక్షన్ 92 CRPC ప్రకారం, సెక్షన్ 5 టెలిగ్రాం ఆక్ట్ ప్రకారం, జిల్లా న్యాయమూర్తి మాత్రమే అనుమతి ఇవ్వాలని అని అన్నారు. జడ్జి లేదా జిల్లా కలెక్టర్ అనుమతి ఇస్తేనే కాల్ డేటా తీసుకోవాలని తెలిపారు. డాటా రిట్రైవ్ చేసే అధికారం పోలీసులకు లేదన్నారు. సర్వీస్ ప్రొవైడర్స్ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.
Covid 19: దేశంలో 5 వేలను దాటిన రోజూవారీ కోవిడ్ కేసులు..