MP Raghunandan Rao : సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ రావు సవాల్
- రేవంత్‌కు రఘునందన్ సవాల్
- అసెంబ్లీ రద్దు చేయాలని డిమాండ్
- రాజీనామాలకు బీజేపీ సిద్ధం
- ప్రజా తీర్పుకు రావాలన్న ఎంపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Raghunandan Rao: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఘాటుగా ప్రతి సవాల్ విసిరారు. రాష్ట్రంలోని ఎనిమిది మంది బీజేపీ ఎంపీలం తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, రేవంత్ రెడ్డికి చేతనైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, శాసనసభను రద్దు చేసి తక్షణమే ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. కావాలంటే కాంగ్రెస్‌కు ఉన్న ఎనిమిది మంది ఎంపీలను అలాగే ఉంచుకోవచ్చని, ప్రజా క్షేత్రంలో ఎవరు గెలుస్తారో తేల్చుకుందామని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి పదవికి తాము ఇస్తున్న గౌరవాన్ని, తమ సంస్కారాన్ని చేతకానితనంగా భావించవద్దని ఆయన హెచ్చరించారు.
Also Read
- Ration Card eKYC: మీరు ఈకేవైసీ పూర్తి చేశారా..? స్టేటస్‌ను సింపుల్‌గా తెలుసుకోండిలా..
- Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త హెల్త్ స్కీమ్ డ్రాఫ్ట్ విడుదల.!
- Telangana RERA : తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊరట.. RERA ప్రాజెక్టులకు 4 నెలల గడువు.!
- OTR : తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పదవికి లైన్ క్లియర్.. బరిలో బాలు నాయక్?
రాజకీయంగా తాము కూడా అంతే ధీటుగా స్పందించగలమని స్పష్టం చేస్తూ, “కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు వడ్లు పోస్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం సరికాదని, అలాగైతే తమకు కూడా కొడంగల్‌లో లేదా ప్రగతి భవన్ (మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్) ముందు వడ్లు పోయడం రాదా?” అని రఘునందన్ రావు నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి కక్షసాధింపు చర్యలు, సవాళ్లు పక్కనపెట్టి రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కూటమి, కేంద్రంపై అనవసర విమర్శలు చేయడం ఆపి, దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజా తీర్పును కోరాలని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!