R Krishnaiah Gives Strong Warning To Central Ministers: కేంద్రమంత్రులకు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీసీల వాటా బీసీలకు ఇవ్వకపోతే.. కేంద్రమంత్రులను తెలంగాణ రాష్ట్రంలో తిరగనియ్యమని హెచ్చరించారు. సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 75 సంవత్సరాలు అయినా, బీసీలకు ఏ రంగంలో కూడా అవకాశాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలపై కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక వైఖరి అవలంభిస్తోందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే బీసీ కులాలను అణచిపెడుతోందని వ్యాఖ్యానించారు. ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం మెజార్టీ ప్రజలను బిచ్చగాళ్లను చేసిందని పేర్కొన్నారు.
Bandi Sanjay: కన్నతల్లిని చంపి.. దండేసి కీర్తించే బాపతు కేసీఆర్
అంతకుముందు.. చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాజకీయ అధికారంలో బీసీలకు న్యాయమైన వాటా లభించనంత వరకు.. సామాజిక న్యాయం సాధ్యం కాదని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటులో బీసీలకు 50శాతం సీట్లు రిజర్వ్ చేసేందుకు.. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలు తీర్మానం చేశాయని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలు, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లతో ఆశించిన ప్రయోజనం లేదన్న ఆయన.. రాజకీయ అధికారం ద్వారానే బీసీల అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు గతంలోనే రిజర్వేషన్లు కల్పించడం వల్ల చట్టసభల్లో ఉన్నతస్థానాలకు ఎదిగే అవకాశం ఏర్పడిందని.. కానీ బీసీలకు రిజర్వేషన్లు లేనందున అలాంటి ప్రయోజనాలు పొందలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Manchu Manoj: భార్య మొదటి పెళ్లికి గెస్ట్ గా వెళ్లిన ఏకైక హీరో నువ్వే భయ్యా..
దేశంలో 2,600 బీసీ కులాలు ఉన్నాయని.. కానీ చట్టసభల్లోకి కేవలం 50 బీసీ కులాలు మాత్రమే ప్రవేశించాయని కృష్ణయ్య తెలిపారు. దేశ జనాభాలో 54శాతం బీసీలు ఉన్నా.. పార్లమెంటు సభ్యుల్లో బీసీల వాటా కేవలం 15 శాతం మాత్రమే ఉందని వెల్లడించారు. భారత రాజ్యాంగాన్ని 121సార్లు సవరించినా.. బీసీల సంక్షేమానికి సంబంధించి ఒక్క సవరణ కూడా చేయలేదన్నారు. రాజకీయ పార్టీలు క్యాబినెట్‌లో బీసీలకు అప్రాధాన్య శాఖలు కేటాయించి.. బీసీలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహించారు. ఆ కారణంగా బీసీల సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఈ విషయాన్ని తాము ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.