Site icon NTV Telugu

కేబినెట్‌ విస్తరణ.. కిషన్‌ రెడ్డికి ప్రమోషన్‌..

Kishan Reddy

Kishan Reddy

తెలంగాణకు చెందిన కిషన్‌ రెడ్డికి కేంద్ర కేబినెట్‌ విస్తరణలో ప్రమోషన్‌ దక్కింది.. సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి విజయం సాధించిన ఆయనకు నరేంద్ర మోడీ 2 సర్కార్‌లో సహాయమంత్రి పదవి దక్కగా.. తాజా కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణలో ఆయన కేబినెట్‌ మినిస్టర్ అయ్యారు.. పాత, కొత్త మంత్రులు కలిసి మొత్తం 43 మంది ప్రమాణస్వీకారం చేయనుండగా.. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భనన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.. మెరుగైన పనితీరు కనబర్చిన పలువురు సహాయ మంత్రులకు ప్రమోషన్ దక్కనున్నట్టుగా తెలుస్తోంది. ప్రమోషన్ అందుకోబోతున్న మంత్రుల్లో కిషన్ రెడ్డి, హర్దీప్ సింగ్ పూరి, పురుషోత్తమ్ రూపాల, మనుష్ మాండవ్య, కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్ ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొత్తగా మంత్రులుగా ప్రయాణ స్వీకారం చేయబోయే వారితో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం నిర్వహించారు. తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టిన భారతీయ జనతా పార్టీ.. కిషన్‌ రెడ్డికి ప్రమోషన్‌ ఇస్తే.. రాష్ట్రంలో పార్టీపై మరింత విశ్వాసం పెరుగుతుందని భావిస్తోంది.. ఇక, బీజేపీలో అంచలంచలుగా ఎదుగుతూ వచ్చిన కిషన్‌ రెడ్డికి కేంద్ర కేబినెట్‌లో కీలక పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం.

Exit mobile version