NTV Telugu Site icon

Telangana: దంచికొడుతున్న వాన‌లు.. ఉప్పొంగుతున్న ప్రాజెక్టులు

Heavy Rains In North Telangana

Heavy Rains In North Telangana

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వానల వల్ల వాగులు, వంకలు పారుతున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతుండగా.. ప్రాజెక్టుల్లోకి వరద పెరుగుతోంది. కాగా.. కామారెడ్డి జిల్లా పాతరాజంపేటలో అత్యధికంగా 12.8 సెం.మీ. వర్షపాతం నమోదవ‌గా.. ఎస్సారెస్పీలోకి 10వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా, కడెంలోనూ నీటిమట్టం పెరుగుతోంది. అయితే.. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్​లోకి ప్రాణహిత నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది.

read also: Fraud Lady: ఆమె వయసు 54.. ఖర్చుల కోసం మూడు పెళ్లిళ్ళు

ఈ నేప‌థ్యంలో ఆఫీసర్లు 16 గేట్లు ఓపెన్ చేసి 45 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఇక మరోవైపు భారీ వర్షాల కారణంగా ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే.. మేడిగడ్డ బ్యారేజీకి ప్రాణహిత నది నుంచి 43 వేల క్యుసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తోంది. దీంతో నీటిపారుదల శాఖ ఆఫీసర్లు 16 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. కాగా.. మహబూబాబాద్​ జిల్లాలోని తొర్రూరు మండలంలోని అమ్మపురం పెద్ద చెరువు మత్తడి దుంకుతోంది. భారీ వ‌ర్షానికి సూర్యాపేట జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు 1042.09 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 638.70 అడుగుల నీరు చేరింది. అయితే.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమనేపల్లి మండలం దిందా -బెజ్జూర్ మండలం సోమిని.. సుస్మిర్ వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

Vizag IT Corridor: ఏపీ సిలికాన్ వ్యాలీపై దిగ్గజ కంపెనీల ఫోకస్

Show comments