MLA Lasyana Nditha: టిప్పర్ లారీని వెనకనుండి ఢీ కొట్టడంతోనే ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిందని పోలీసులు గుర్తించారు. లాస్య నందిత ఢీ కొట్టిన టిప్పర్ లారీని పోలీసులు గుర్తించారు. ORR పైకి ఎంట్రీ అయినా సమయంలో ముందు వెళ్తున్న లారీల సీసీ కెమెరాలను పటాన్ చెరువు పోలీసులు గుర్తించారు. ముందు వెళ్తున్న టిప్పర్ లారీని ఎమ్మెల్యే లాస్య నందిత కారు బలంగా ఢీ కొట్టింది. లారీని ఢీ కొట్టిన తర్వాత 100 మీటర్ల దూరం వెళ్లి ORR సైడ్ రేలింగ్ ని ఢీ కొట్టిన కారు అక్కడే ఆగిపోయింది. వెనక నుండి లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగంలో లెఫ్ట్ సైడ్ ఎమ్మెల్యే లాస్య నందిత కూర్చోవడంతో తలకి తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో లాస్య అక్కడికక్కడే మృతి చెందారు. డైవింగ్ చేస్తున్న ఆకాష్ కొన ఊపిరితో ప్రమాదం నుంచి బయట పడ్డారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత టిప్పర్ లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు లాస్య ప్రమాదం పై ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం కూడా లాస్య ప్రమాదం పై వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆధారాలు సేకరించారు. లాస్య ఆరోజు ఎక్కడికి వెళ్లింది? తిరుగు ప్రయాణంలో ఎవరెవరు ఉన్నారు? లారీని ఢీ కొట్టడం పై ఉన్న అనుమానాలు పై ఆరా తీశారు. అయితే టిప్పర్ లారీని గుర్తించిన పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు.
Read also: Paytm : పేటీఎం కీలక నిర్ణయం.. పేమెంట్స్ బ్యాంక్ తో సంబంధాలకు చెక్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున పటాన్‌చెరు ఓఆర్‌ఆర్ వద్ద కారు అదుపు తప్పి.. డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. లాస్య నందిత వయసు 33. బీఆర్‌ఎస్ యువ ఎమ్మెల్యే మృతి పట్ల తెలంగాణ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చిన్న కుమార్తె లాస్య నందిత. 2023 ఫిబ్రవరిలో సాయన్న మరణించడంతో.. ఆ స్థానం నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత పోటీ చేశారు. ఈ టికెట్ కోసం స్థానిక నేతలు కొందరు గట్టి ప్రయత్నాలే చేసినా.. నందితపై మాజీ సీఎం కేసీఆర్ నమ్మకం ఉంచారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17,169 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు.
National Drinking Water Survey : 485 నగరాల్లో 46 నగరాల ప్రజలు మాత్రమే స్వచ్ఛమైన నీరు తాగుతున్నారట
