KTR: దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఇవాళ ఉదయం కార్ఖానాలోని ఆమె నివాసానికి మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి కేటీఆర్ వెళ్లి నందిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కారు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు ముగిశాయి. మారేడ్‌పల్లి హిందూ శ్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు.
MLA Lasya Nanditha Dies: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో కన్నుమూశారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు శుక్రవారం తెల్లవారుజామున పటాన్‌చెరు ఓఆర్‌ఆర్ వద్ద ప్రమాదానికి గురైంది. ఓఆర్‌ఆర్‌లోని సుల్తాన్ పూర్ వద్ద కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే లాస్య నందిత పీఏ ఆకాశ్, డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుకుని పరిశీలించారు. మేడ్చల్ నుంచి పటాన్‌చెరువు వస్తుండగా ఎమ్మెల్యే…
BRS MLA Lasya Nanditha Dead: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున పటాన్‌చెరు ఓఆర్‌ఆర్ వద్ద కారు అదుపు తప్పి.. డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. లాస్య నందిత వయసు 33. బీఆర్‌ఎస్ యువ ఎమ్మెల్యే మృతి పట్ల తెలంగాణ రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న…
Cantonment MLA Lasya Nanditha stuck in the Lift: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. సికింద్రాబాద్‌లో ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే లాస్య నందిత వెళ్లగా.. ఆమె ఎక్కిన లిఫ్ట్ ఓవర్‌లోడ్ కారణంగా కిందకి వెళ్లిపోయింది. దాంతో లిఫ్ట్‌లో ఉన్న ఎమ్మెల్యే ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది వెంటనే అప్రమత్తం అయి లిఫ్ట్ డోర్లు బద్దలు కొట్టారు. దాంతో ఎమ్మెల్యే లాస్య నందిత సురక్షితంగా బయటకు వచ్చారు. Also Read: Prajapalana…