NTV Telugu Site icon

Priyanka Gandhi: తెలంగాణ కాంగ్రెస్‌పై ప్రియాంక గాంధీ ఫోకస్

Priyanka

Priyanka

తెలంగాణ కాంగ్రెస్ విషయంలో అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. తెలంగాణ కాంగ్రెస్ కి పూర్తి సమయం ఇస్తానన్నారు ప్రియాంకా గాంధీ. ఎవరైనా ఇబ్బంది..సమస్యలు ఉన్నా నాకు చెప్పండి అంటూ ప్రియాంకా గాంధీ భరోసా ఇచ్చారు. పార్టీ అధికారం లోకి వస్తే మీకే మంచిది. పంచాయతీలు పెట్టుకుంటే మీరు..మేము నష్టపోతామని ప్రియాంక స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడే బాధ్యతను దామోదర రాజనర్సింహ.. మధు యాష్కీ లకు అప్పగించారు కేసీ వేణుగోపాల్. మునుగోడు ఉప ఎన్నికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అంతేకాకుండా అభ్యర్ధి ఎంపిక పై ఏఐసీసీ కార్యదర్శులు రేపటి నుండే కసరత్తు చేయాలని ప్రియాంక ఆదేశాలిచ్చారు. ఈ విషయంలో జిల్లా నాయకుల అభిప్రాయాలు సేకరించాలని ఆదేశించారు.

మునుగోడులో ఒకవైపు బీజేపీ, మరోవైపు టీఆర్ఎస్ పార్టీలు బహిరంగ సభలు నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. కాంగ్రెస్‌ సైతం మునుగోడులో మునుగోడులో బహిరంగ సభకు ప్లాన్‌ చేస్తోంది.సెప్టెంబర్‌ తొలి వారంలో మునుగోడులో కాంగ్రెస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తోంది.కాంగ్రెస్‌ మునుగోడు సభలో పాల్గొనేందుకు ఆ పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీ విచ్చేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ కీలక నేతలతో సమావేశాలు నిర్వహిస్తోంది.

Read Also: Schools Bandh: విద్యార్థులకు అలర్ట్.. నేడు తెలుగు రాష్ట్రాలలో స్కూళ్లు, కాలేజీలు బంద్

ఢిల్లీ వేదికగా ప్రియాంకా గాంధీ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికపై ఆమె సమీక్ష చేశారు. ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ సమావేశమయ్యారు. సోనియా గాంధీ నివాసంలో ఈ భేటీ జరిగింది. మునుగోడు ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థి ఎంపిక, అనుసరించాల్సిన రాజకీయ వ్యూహం, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అనే అంశాలపై ఈ భేటీలో కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ భేటీకి కాంగ్రెస్ కీలక నేతలు హాజరయ్యారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇంచార్జ్​ మాణిక్కం ఠాగూర్‌‌ తో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధు యాష్కీ గౌడ్ , శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి .. తదితరులు ప్రియాంకాగాంధీతో భేటీ అయ్యారు. అయితే, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆహ్వానం వున్నా హాజరుకాకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. రేవంత్ తో కలిసి సమావేశానికి రావడానికి కోమటిరెడ్డి విముఖత వ్యక్తం చేశారు. మరోవైపు రేవంత్ తీరుపై సీనియర్లు ప్రియాంకాగాంధీకి ఫిర్యాదుచేసినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంపై ప్రియాంకాగాంధీ ట్వీట్ చేశారు. తెలంగాణ నేతలతో ఈరోజు మంచి సమావేశం జరిగింది…రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం రెండింటికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలనే తమ సంకల్పాన్ని పునరుద్ధరించుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు ప్రియాంక.