Site icon NTV Telugu

వలసకూలీల లగేజీతో ప్రైవేట్ బస్సు డ్రైవర్‌ పరార్‌..

ఓ ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌ చేసిన నిర్వాహకానికి దిక్కు తోచని స్థితిలో పడ్డారు వలస కూలీలు.. ప్రైవేట్ బస్సు డ్రైవర్‌, క్లీనర్‌ ప్రయాణికు లను నిలువు దోపిడి చేశారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరు స్తానని నమ్మించి మార్గ మధ్యలోనే వారి లగేజీలతో ఊడాయించాడు. ఈ ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కెట్‌ పల్లిలో చోటు చేసుకుంది.

కేరళ నుంచి అసోంకు 65 మంది వలస కూలీలు ఓ ప్రైవేట్‌ బస్సులో ప్రయాణిస్తున్నారు. నార్కెట్‌ పల్లి శివారు జాతీయ రహదారిపై ఓ హో టల్ వద్ద టీఫీన్‌ చేసేందుకు డ్రైవర్‌ బస్సును ఆపాడు. ప్రయాణి కులు కిందకు దిగగానే డ్రైవర్‌, క్లీనర్‌ లగేజీలతో బస్సులో పరారయ్యా రు. ప్రయాణికులు బీహార్‌, బెంగాల్‌, నేపాల్‌, అసోంకు చెందిన వలస కూలీలుగా తెలుస్తుంది. తమ సామాన్లు పోయాయని వారు నార్కెట్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేరళలోని పనులు ముగిం చుకుని సొంత ఊర్లకు వెళ్లేందుకు ఓ ఏజెంట్ ద్వారా ఒక్కొక్కరూ రూ. 3,500 చెల్లించినట్లు బాధితులు తెలిపారు. బస్సు డ్రైవర్‌, క్లీనర్‌ కోసం పోలీసులు వెతుకుతున్నారు. పోలీసులు బాధితుల కోసం స్థానికంగా ఓ ఫంక్షన్‌ హాలులో బస ఏర్పాటు చేశారు.

Exit mobile version