NTV Telugu Site icon

Deputy Manager: డిప్యూటీ మేనేజర్‌ చేతివాటం.. ఖాతాదారులకు తెలియకుండా రూ.8.65 కోట్లు స్వాహా

Bank Meneger

Bank Meneger

Deputy Manager: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ చేతివాటం ప్రదర్శించాడు. పని చేస్తున్న బ్యాంకులో ఖాతాదారుల అకౌంట్ లోని డబ్బులను వాడుకున్నాడు. వేలల్లో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే మేనేజర్ కొట్టేసింది సుమారు రూ.8.5 కోట్లు. దొంగిలించిన ఖాతాదారుల సొమ్మును ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు ఉపయోగించాడు. ఈ భాగోతం వెలుగులోకి రావడంతో ఈవార్త కాస్త సంచలనంగా మారింది.

Read also: Hyderabad: జహీరాబాద్‌లో విశాల్‌ షిండే హత్య కేసు.. నిందితుడు నజీర్‌ అహ్మద్‌ మృతి

కరీమాబాద్‌కు చెందిన బైరిశెట్టి కార్తీక్ నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కానీ అతను ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. దీంతో బ్యాంకు నుంచి ఖాతాదారుల సొమ్మును వాడుకోవడం ప్రారంభించాడు. బ్యాంకులో బంగారం నిల్వ చేసి తీసుకున్న రుణాన్ని చెల్లించేందుకు వచ్చిన ఖాతాదారుల నుంచి నగదు తీసుకుని బంగారం ఇచ్చాడు. కొంత డబ్బు చెల్లించి ఖాతాను రెన్యూవల్ చేయించుకుని నకిలీ లావాదేవీలు జరిపాడు. కొన్నిసార్లు బ్యాంకు లాకర్లలో ఖాతాదారులు ఉంచిన బంగారు ఆభరణాలను బయటకు తీసి అదే బంగారాన్ని బినామీ పేరుతో తన బ్యాంకులో డిపాజిట్ చేసేవాడు. ఆ డబ్బుతో ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు ప్రారంభించాడు. అక్కడక్కడా ఖాతాదారులను, బ్యాంకును మోసం చేస్తున్నాడు.

కొన్నిసార్లు కస్టోడియన్, ఆడిటర్ సంతకాలు ఫోర్జరీ చేసి అక్రమాలకు పాల్పడ్డారు. 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 128 మంది ఖాతాల నుంచి రూ.8.65 కోట్లు వాడినట్లు బ్యాంకు ఆడిటింగ్‌లో తేలింది. ఈ తతం గత నెల 11న వెలుగు చూసింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు నర్సంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంకు ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఖాతాదారుల డబ్బును ఎలా తిరిగి ఇవ్వాలి? ఖాతాదారులకు తెలియకుండా బంగారం చోరీకి గురైనందున ఖాతాదారులకు నష్టం వాటిల్లకుండా బ్యాంకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.
India: నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ భేటీ.. సీట్ల షేరింగే ప్రధాన ఎజెండానా?

Show comments