PrajaVani: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. సీఎం ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ప్రజాదర్బార్ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యేందుకు కృషి చేస్తుందన్నారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు నేటి నుంచి కొత్త కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. దానికి ప్రజా వాణి అని పేరు పెట్టామని తెలిపారు. ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేటి నుంచి (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానుంది.
Read also: 100 Day Cough: కలకలం రేపుతోన్న వందల రోజుల దగ్గు వ్యాధి..
అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. అర్జీల స్వీకరణ… ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను రాష్ట్ర స్థాయి అధికారులకు పంపారు. దీంతో నియోజకవర్గాల్లోని ప్రజలు తమ సమస్యలను స్థానిక అధికారులకు చెప్పుకునే అవకాశం ఏర్పడింది. అయితే.. ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా నిర్వహించాలని, ముఖ్యంగా జిల్లా పాలనాధికారి ప్రత్యేక చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఉపయోగించుకుంటారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
Read also: Smart Phones : మీ ఫోన్లో యాడ్స్ ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఇలా చెయ్యండి..
అయితే.. అధికార యంత్రాంగం ఇప్పటి వరకు ప్రజావాణి మొక్కుబడిగానే నిర్వహిస్తూ వస్తోంది. ఇక ప్రధానంగా సమయ పాలన పాటించే వారు కాదు..అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు వస్తేనే వినతులకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. కాగా.. ఆయా శాఖల కింది స్థాయి అధికారులు వస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇంతకుముందు ప్రజావాణిలో ఫిర్యాదులపై ప్రత్యేక సమీక్ష జరిగేది. కానీ.. ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు పరిష్కారమయ్యేవో చర్చించే వారు, కానీ.. కొన్నాళ్లుగా సమీక్ష అనేదే లేదు. పరిష్కారం చూపని అధికారులపై పాలనాధికారి ఆగ్రహించిన రోజులు ఉన్నాయి. కొన్నాళ్లుగా అర్జీలు తీసుకుంటున్నారే తప్ప..వాటి పరిష్కారానికి దృష్టి సారించడం లేదు.
Karthika Masam Last Monday: కార్తిక మాసం ఆఖరి సోమవారం.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు