Ponnam Prabhakar: సిద్దిపేటలోని 220 కేవీ సబ్ స్టేషన్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సబ్‌స్టాన్‌లో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరం. పీటీఆర్ పేలడంతో సబ్‌స్టేషన్‌లో ప్రమాదం జరిగిందని తెలిపారు. మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారని అన్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. మరోవైపు సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తాలోని 220కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లో బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్లు పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరిగిన విషయం తెలిసిందే. పవర్ ట్రిప్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Read also: WPL 2024: డబ్ల్యూపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ.. షారుఖ్ స్పెషల్ పర్ఫామెన్స్!
కాగా.. ప్రమాదం గురించి తెలియగానే సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా చేయాలని ట్రాన్స్‌కో అధికారులు, సిద్దిపేట విద్యుత్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యుత్ అధికారులను హరీశ్ రావు కోరారు. ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో సుమారు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
WPL 2024: డబ్ల్యూపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీ.. షారుఖ్ స్పెషల్ పర్ఫామెన్స్!