Ponnam Prabhakar : కరీంనగర్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీపై ఘాటుగా విరుచుకుపడ్డారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుండే పార్టీ అని పేర్కొన్నారు. దళితులు, బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
బలహీన వర్గాలకి ముఖ్యమంత్రి ఇస్తామని బీజేపీ ప్రకటించినా, శాసనసభ నాయకత్వం ఇవ్వలేకపోయిందని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి అకారణంగా తొలగించడం బీజేపీ మతిమరుపును చూపుతోందని అన్నారు.
కులగణనకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మంత్రులు, శాసనమండలి స్థానాలను ఇచ్చి బలహీన వర్గాలకు మద్దతుగా నిలిచిందని ఆయన తెలిపారు. కానీ బీజేపీ మాత్రం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడిన రాంచంద్రరావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం బలహీన వర్గాలకు వ్యతిరేక ధోరణి అని పేర్కొన్నారు.
Delhi: ఢిల్లీలో రచ్చకెక్కిన కర్ణాటక పంచాయితీ.. కొట్టుకున్న సిద్ధరామయ్య-శివకుమార్ ఆఫీసర్లు
“మమ్మల్ని ప్రశ్నించే బీజేపీ నాయకులు ముందు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. కిషన్ రెడ్డి తన మంత్రిపదవి నుంచి రాజీనామా చేసి, అరవింద్, లక్ష్మణ్, ఈటల రాజేందర్, ఆర్. కృష్ణయ్య వంటి బీసీలకు మంత్రి పదవి ఇవ్వాలి” అని మంత్రి డిమాండ్ చేశారు.
పాయల్ శంకర్ లాంటి వారికి బీజేపీ శాసనసభ పక్షనేత పదవి ఇవ్వలేకపోవడం దాని బలహీన వర్గాలపై నిర్లక్ష్యాన్ని చూపుతోందని విమర్శించారు. 42% బీసీ రిజర్వేషన్ ప్రతిపాదన రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని, దానికి బీజేపీ సహకరించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
Finance Scam: ఫైనాన్స్ ముసుగులో దారుణాలు.. వెలుగులోకి తండ్రీకొడుకుల బాగోతం..!
