Ponnam Prabhakar: అనాడు రాజీవ్ గాంధీ యే రాముడి చరిత్ర వెలికి తీశారు..
Ponnam Prabhakar: అనాడు రాజీవ్ గాంధీ యే రాముడి చరిత్ర వెలికి తీశారని రవాణా, బీసీ సంక్షేమం మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని పొన్నం ప్రభాకర్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు రాజన్న ఆలయంలోకి పూర్ణకుంభ స్వాగతం పలికారు. రాజన్నకు కోడె మొక్కు సమర్పించుకొని మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇవాళ బోగి సందర్భంగా తెలంగాణ ప్రజలకు బోగి ,మకర ,సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా పడాలి, రైతులు బాగుండాలని కోరారు. దేవుడిని కూడ ఈదేశంలో రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. హిందూ సంస్కృతి ఉన్న వారు దేశాన్నీ గౌరవిస్తారు, దేవుడు కొందరికే స్వంతం అని వ్యవహరిస్తున్నారని తెలిపారు. దేశంలో 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 12 ద్వాదశ లింగాలు, 18 జ్యోతి లింగాలు, నాలుగు వేదాలు, నలుగురు జగద్గురులు ఉన్న దేశంలో వాళ్ళ చేతుల మీదుగా రామాలయం ప్రారంభం చేయాల్సి ఉండగా.. రాజకీయాల కోసం దేవుడిని ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. పవిత్ర భారత దేశంలో రాజకీయాలను కూడ మార్కెటింగ్ చేస్తున్నారు, తాము ప్రశ్నిస్తే మేము హిందువులకు వ్యతి రేఖం అంటున్నారని తెలిపారు.
Read also: Ram Mandir : 74శాతం ముస్లింలు రామ మందిర నిర్మాణం పట్ల సంతోషంగా ఉన్నారు.. సర్వే నివేదిక
Also Read
- Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
- Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం... పగలు సెగలు..సాయంత్రం జల్లులు
- Rain Effect : అకాల వర్షం.. రైతులు ఆగమాగం..
- Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
హిందుత్వాన్ని విశ్వసించే వారు ఆలోచన చేయాలని తెలిపారు. దేవాలయంను పూర్తి కాలేదు అని జగద్గురువులు చెబుతున్నారని అన్నారు. దేవుడు కొందరి వాడు కాదు.. అందరి వాడు అన్నారు. రాముడు, శివుడు హన్మంతుడు మాకు లేడా అంటే మా పై రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మీ ప్రతిష్ట దిగజారుతున్న మీరు ఇంకా రాజకీయం చేస్తున్నారు, పార్లమెంట్ లో ఆదాని అంబానీ, గురించి ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పడం లేదని అన్నారు. శివరాత్రి కంటే ముందు రాజన్న ఆలయ అభివృద్ధిపై వీటిడీ ఏ మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాజీవ్ గాంధీ యే రాముడి చరిత్రను అప్పట్లో వెలికి తీశారని గుర్తుచేశారు.
Devil: ఓటీటీలోకి బ్రిటిష్ ఏజెంట్ వచ్చేసాడు…
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!