Ponnala Lakshmaiah: రేవంత్ రెడ్డి పై పొన్నాల ఫైర్.. నీ మీద అందుకే కంప్లైయింట్ ఇచ్చారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnala Lakshmaiah: విల్లాలు, కోట్ల రూపాయలు, భూములు దొబ్బేసవని ఇప్పటికే బోలెడు మంది కంప్లెయింట్ ఇచ్చారని రేవంత్ రెడ్డి పై పొన్నాల లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. నిన్న పొన్నాల పై రేవంత్ అన్న మాటలకు స్పందించారు. పొన్నాల చావు గురించి మాట్లాడవు.. ఎవరి చావు ఎప్పుడొస్తాడో ఎవడు చెప్తాడు.. 80 ఏళ్ళ వయసున్న మనిషిని పట్టుకొని ఇలాగా మాట్లాడేది.. మనిశివా పశువువా.. అంటూ ఫైర్ అయ్యారు. నీ తోడ పుట్టిన వాళ్లు అంత బతికే ఉన్నారా.. నీ పాపాలు నిన్ను వెంబడిస్తున్నాయన్నారు. బిడ్డ పెళ్లిని కూడా బ్లాక్ మెయిల్ చేసి 6 కోట్లు అడ్డుకున్న బిచ్చగాడివి అంటూ ఫైర్ అయ్యారు. నీ.. మొకానికి ప్రజా సేవ అంటే తెలుసా? పైసలు సేవ చేసే నువ్వు నా గురించి మాట్లాడుతావా అంటూ మండిపడ్డారు. నువ్వు కొడంగల్ గెలిచావ? అక్కడ తంతే మల్కాజిగిరి వచ్చి పోటీ చేసావు.. అంత పోటు గాడివి అయితే మహబూబ్‌నగర్ లో ఎందుకు పోటీ చెయ్యలేదు? అంటూ ప్రశ్నించారు. మల్కాజ్ గిరిలో జనరల్ సీట్లో మాదిగ సామాజిక వర్గం చెందిన సర్వే సత్యనారాయణ గెలిచాడు.. టీడీపీ నుంచి మల్లారెడ్డి గెలిచాడు.. నువ్వు ఏమైనా పోటుగాడివా.. అక్కడ గెలిచే అవకాశం ఉంటే వచ్చి వాలవు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ ఒక కొత్త లీడర్ చేతిలో చావు దెబ్బ తిన్న నువ్వా నాకు చెప్పేది అంటూ రేవంత్ పై మండిపడ్డారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి లో జీహెచ్ఎంసీ ఎన్నికలో ఎన్ని ఓట్లు వచ్చాయి అని ప్రశ్నించారు. నీ మోఖానికి పీసీసీ అయ్యాక ఒక ఎన్నికల్లో అయిన డిపాజిట్ వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. నువ్వు ఒక బ్లాక మెయిలర్, ఒక చెత్త లీడర్ నువ్వా నాకు చెప్పేది అంటూ ఫైర్ అయ్యారు. సీఎల్పీ లీడర్ గా జానారెడ్డి రెండు సార్లు ఓడిపోయాడు.. ఉత్తమ్ ఆయన భార్య ఓడిపోయిందని అన్నారు. నువ్వు 50 కోట్లు తీస్కొని ప్రెసిడెంట్ తెచ్చుకున్నవని కోమటి రెడ్డి తిడితే ఆయన ఇంటికి పోయి కాళ్ళు మొక్కావని సంచలన వ్యాఖ్యలు చేశారు. విల్లాలు, కోట్ల రూపాయలు, భూములు దొబ్బేసవని ఇప్పటికే బోలెడు మంది కంప్లెయింట్ ఇచ్చారన్నారు. నీవు ఒక సైకో గాడివి.. పైసలు పిచ్చోడివి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నోటు ఓటు కేసులో అడ్డంగా దొరికిన అడ్డ గాడదవు అన్నారు. ఇప్పుడు సీటు నోట్లు తీసుకుంటూ అసలు కాంగ్రెస్ వాళ్లకు పంగాణమాలు పెడ్తున్న కన్నింగ్ నా కొడుకువి అంటూ ఫైర్ అయ్యారు. ఢిల్లీలో రాహుల్, సోనియా, చుట్టూ ఉండే వాళ్లకు బ్రోకెరిజం చేసి వాళ్ళను మాయ చేసి నీకు పదవులు వచ్చేలా చేస్కున్నావని అన్నారు.
Also Read
కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు బ్రోకర్లు, లంపేయిన్ గాళ్ళు నడిపిస్తున్నారని ఫైర్ అయ్యారు. సర్వేల పేరిట పాత వాళ్లను పక్కన పెట్టి కొత్త వాళ్లకు సీట్లు ఇస్తుంది నిజం కాదా? అని ప్రశ్నించారు. టికెట్లు ఇస్తానని డబ్బులు, భూములు, విల్లాలు, బంగారం బ్రిక్ లు ప్లాట్లు తీసుజోలేదని టికెట్స్ ఇచ్చే విషయంలో అంత పారదర్శకంగా జరుగుతుందని నీ మనుమడిని పట్టుకొని భాగ్యలక్ష్మి గుల్లో ప్రమాణం చేస్తావా? నీకు కోట్లాది రూపాయలు ఇచ్చామని ఇచ్చిన వాళ్లే చెవుతున్నారు.. నీకు డబ్బులు ఇవ్వకపోతే అమెరికాలో ఉన్న వారికి, పార్టీలో ఇంకా చేరని వారికి ఒక నియోజకవర్గంలో ఉంటే ఇంకో నియోజక వర్గంలో, ఎలా టికెట్స్ కు ఎంపిక చేస్తారన్నారు. చావుదలకు అంటున్నారు.. చావు చెప్పి వస్తాడా.. అని ఫైర్ అయ్యారు. పది పార్టీలు మారిన నీకు నా గురించి మాట్లాడే అర్హత ఉందా? 45 ఏళ్ళు ఒక పార్టీలో ఉన్న నేను నీ చిల్లర రాజకీయాలు, నీ కుల అహంకారం భరించలేక ఆత్మగౌరవం కోసం రాజీనామా చేసా? నువ్వు ఎవదివి అసలు.. గాంధీ భవన్ లో జోర్రిన గాడిద కొడుకువు.. పార్టీని నాశనం చెయ్యడానికి వచ్చిన ఒక పాగల్ గాడివి.. డబ్బు పిచ్చి పట్టిన ఒక దగుల్బాజీవి అంటూ రేవంత్ రెడ్డి పై పొన్నాల ఫైర్ అయ్యారు.
Health Tips : రోజూ పరగడుపునే కరివేపాకుల నీటిని తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
తాజావార్తలు
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!