NTV Telugu Site icon

Ponguleti Sudhakar Reddy: ఖమ్మంలో 16న వనభోజనాలు.. 29న సేవా సుపరిపాలన సభ

Ponguleti Sudhakar Reddy

Ponguleti Sudhakar Reddy

Ponguleti Sudhakar Reddy: ఖమ్మంలో ఈనెల 16న సామూహిక వనభోజనాలు, రాష్ట్ర వ్యాపితంగా ఆత్మీయ కలయిక నిర్వహస్తున్నామని, 29న సేవా-సుపరిపాలన సభ జరగబోతుందని బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కిలాడి రాజకీయ క్రీడా మొదలైందన్నారు. కిలాడి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కిలాడి రాజకీయాలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. పిట్టలదొర మాటలతో ప్రజలని గాలికి వదిలేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారు తెలంగాణ పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారని అన్నారు. తెరవెనుక, తెరముందు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ను ముందు పెట్టి బీజేపీని బదనాం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పార్టీగా,స్కామ్ లేని, స్కీం ఉన్న పార్టీగా బీజేపీ ఉందన్నారు. బీజేపీ పై విషం కక్కుతున్నారని అన్నారు. అసలు రాష్ట్రంలో కోర్టులకు విలువ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టుకోవాలో తేల్చుకోలేక చస్తున్నారి తీవ్రంగా మండాపడ్డారు. రాష్ట్రంలో రైతు రుణ మాఫీ ఊసే లేదన్నారు. అకౌంట్ లన్నీ ఫ్రీజ్ చేస్తున్నారు బ్యాంక్ వాళ్ళు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలపై పర్యవేక్షణ లేదన్నారు. దళిత బంద్ లేనే లేదని, బీఆర్ఎస్ దళిత బందా?..
దళిత బంధా చెప్పాలని వ్యంగాస్త్రం వేశారు. ఎరువులకు కేంద్రం రాయితీ ఇస్తున్నా అది ప్రజలకు తెలియనీయకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Read also: WHO: కూల్‌ డ్రింక్స్‌లో కేన్సర్ కారకం.. WHO కీలక ప్రకటన

ముద్ర లోన్లు లేవని, జిల్లా మంత్రి మాటలకు చేతలకు పొంతన లేదన్నారు. మీ సొంత ఆస్తి కాదు కదా? అని ప్రశ్నించారు. కార్మికులను రెగ్యులర్ చేయరని, కేసీఆర్ కిట్లతో మసి పూసి మారేడు కాయ చేస్తున్నారని మండిపడ్డారు. గంజాయికి పెట్టింది పేరుగా ఖమ్మం పరాకాష్టకు చేరిందని అన్నారు. ప్రజలు రాత్రి బయటకు రావడానికి భయపడుతున్నారని అన్నారు. ఏటీఎం లాగా గంజాయి పాయింట్లు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వాళ్లే పెంచిపోషిస్తున్నారని అన్నారు. ఇసుక మాఫియా కొనసాగుతుందని అన్నారు. పోలీసులు ప్రజల పక్షాన ఉండాల్సింది పాలకులకు వంత పాడుతున్నారని మండిపడ్డారు. ఖమ్మంలో క్రైమ్ విచ్చలవిడి అయిపోయిందని అన్నారు. మొన్న జరిగిన పవన్ సాయి హత్య కేసులో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా గంజాయిని జిల్లా నుంచి తరిమికొట్టాలని కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు చేతకాకపోతే మేమే చెక్ పోస్టులు పెట్టుకుంటామని అన్నారు. 6 నెలలుగా విన్నవించినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. ఈనెల 16న సామూహిక వనభోజనాలు.. రాష్ట్ర వ్యాపితంగా ఆత్మీయ కలయిక నిర్వహస్తున్నామన్నారు. డబుల్ బెడ్రూం, రేషన్ కార్డు, బీఆర్ఎస్ ఇవ్వని మోసాలపై త్వరలో కార్యక్రమం తీసుకుంటామన్నారు.
WHO: కూల్‌ డ్రింక్స్‌లో కేన్సర్ కారకం.. WHO కీలక ప్రకటన