NTV Telugu Site icon

Ponguleti: పార్టీకి నష్టం కలిగించొద్దు.. ఇప్పటికే పలుచన అవుతున్నాం

Pogulety

Pogulety

Ponguleti: మనం ఇప్పటికే పలుచన అవుతున్నాము.. పార్టీకి నష్టంకలిగే విధంగా కార్యకర్తలు వ్యవహరించ వద్దని మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ విజయభేరి సన్నాహక సమావేశం కొనసాగుతుంది. ఈ నెల 17న హైదరాబాద్ లో జరగనున్న కాంగ్రెస్ పార్టీ విజయ భేరి బహిరంగ సభపై పార్లమెంటరీ స్థాయి సమావేశానికి ఇన్చార్జిగా మహమ్మద్ ఆరిఫ్ నసీం ఖాన్ లు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , వి.హెచ్ హనుమంత్ రావు, మాజీ మంత్రి రేణుక చౌదరి పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్థానాలకి పోటీలు పడుతున్న వారి అనుచర వర్గం నినాదాలతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మారుమోగింది. సీఎం భట్టి అంటూ నినాదాలు చేయడంతో ఆ కార్యాలయం అంతా భట్టి నినాదాలతో నిండిపోయింది.

ఇక మరోవైపు పొంగులేటి మాట్లాడుతూ.. మనం ఇప్పటికే పలుచన అవుతున్నామని అన్నారు. అందువల్ల పార్టీకి నష్టం వాటిల్లే విధంగా కార్యకర్తలు వ్యవహరించ వద్దని అన్నారు. అందరం కలసి పని చేద్దామన్నారు. మన పోరాటం 17 మీటింగ్ లో చూపిద్దాంమని తెలిపారు. బీఆర్ఎస్ సేక్ అయ్యే విధంగా మనం పోరాటం చేద్దామని పిలుపు నిచ్చారు. మనల్ని నమ్ముకున్న నాయకులకు నష్టం రాకుండా చూడాలని అన్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాలో ఒకే తాటి మీదకు వస్తామని తెలిపారు. పదికి పదికి సీట్లు గెలుస్తామన్నారు. ఒక్క శ్రీనివాస్ రెడ్డీతో కాదు అందరం కలసి పోరాటం సాగిద్దామని పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపారు. అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. పెద్దలం అందరం కలసి పని చేస్తామని పొంగిలేటి అన్నారు.

రేణుకా చౌదరి

40 ఏళ్లు పని చేసిన వాళ్ళకి కాంగ్రెస్ లో గుర్తింపు రాలేదని రేణుకా చౌదరి అన్నారు. తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితి వుందని, అన్యాయం జరిగేందుకు అవకాశం వుందని తెలిపారు. ఎవ్వడేమి చేసిన ఖమ్మం కాంగ్రెస్ జిల్లా ఎవ్వరికీ సీటు ఇచ్చిన మోసం చేసిన గెలిచిన వారికి బుద్ది చెబుదామని తెలిపారు. ఎటువంటి వారికి ఈ పార్టీలో స్థానం లేదు.. ముస్తఫా వంటి వారికి అన్యాయం చేస్తే స్పందించే వాళ్ళు వుండరని తెలిపారు. మూడు సింహాల టోపీ లు పెట్టుకుని అధికార పార్టీ తొత్తులుగా మారుతున్నారని అన్నారు. బీజేపీ కేసీఆర్ వేరెవరూ కాదు… రాబందులు చాలా మంది వున్నారని తెలిపారు. బయట గల్లా పెట్టుకుందాం.. ఇక్కడ అందరం ఒక్కటే నినాదంగా వుండాలని తెలిపారు. నాకు చేదు నిజం చెప్పే అలవాటు ఉందని అన్నారు. 40 సంవత్సరాల నుండి పార్టీ కోసం పనిచేసిన కొంతమంది నాయకులకు గౌరవం దక్కట్లేదని అన్నారు. ఖబర్దార్ అజయ్ కుమార్ దమ్ముంటే రా అని సవాల్ విసిరారు. పోలీస్ సిబ్బందిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసు బ్రదర్స్ గాలి మారిపోయింది .. రాబోయేది కాంగ్రెస్ ఉండబోయేది కాంగ్రెస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Phone on Plane: ఫ్లైట్ టేకాఫ్ సమయంలో సెల్ ఫోన్ వాడకూడదు.. ఎందుకో తెలుసా?

Show comments