Ponguleti: ఎంత పెద్ద మొగోడైన ప్రజా తీర్పుకు తల వంచాల్సిందే అని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో అనేక గ్రూప్ లు ఉన్నాయని అన్నారు. అందరం ఐక్యతతో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అహంకారంకు పోకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. 10 ఏళ్లుగా ఈ ప్రాంతానికి పట్టిన దరిద్రంను పోగొట్టేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు. 10 రోజులలో 18 గంటలు కష్టపడి ఓటర్లను బూత్ ల వరకు తీసుకు వెళ్ళాలని అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తుందన్నారు. అధికారంలో ఉన్న వ్యక్తికి హుజూరాబాద్ లో వందల కోట్లు ఖర్చు పెట్టిన అధికార పార్టీకి ఫలితం దక్కలేదని.. అక్కడ వచ్చిన ఫలితమే సత్తుపల్లి లో వస్తుందన్నారు. డబ్బుతో రాజకీయం చేయలేం..అది సాధ్యం కాదన్నారు. బడా బాబులు వచ్చి డబ్బుల సంచులు ఇచ్చినంత మాత్రాన సత్తుపల్లి ప్రజలు మోసపోరని తెలిపారు. కరోనా సమయంలో నీళ్ల ఇంజక్షన్ లు చేసి డబ్బులు పోగేసి ఆ డబ్బులు ఇప్పుడు ఖర్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలి? అని ప్రశ్నించారు. డబ్బుతో రాజకీయం చేయాలనుకోవడం మూర్ఖత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగస్తులకు జనం మీదకు పంపి వాళ్ళను మార్చాలి అనుకోవటం అమాయకత్వమన్నారు. వందల, కోట్లు పంచండి.. ఉమ్మడి జిల్లాలో ప్రజలు చైతన్యవంతులని తెలిపారు. కేసీఅర్ ను మించిన మంచి మాటకారి, అంతేకాదు పరోక్షంగా సండ్ర పై విమర్శలు గుప్పించారు. సామాన్య ప్రజలను,చిన్న చిన్న వారిని పెట్టిన ఇబ్బందులు ఎవరు మర్చిపోరు..రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే ప్రభుత్వం ఎంటో అందరికీ తెలుసన్నారు. డిసెంబర్ 9 తరువాత తోత్తులకు, కబ్జాదారులు అర్థం అవుతుంది.. తెలంగాణ ప్రజల తీర్పు ఏంటో అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా బలం మనది.. డబ్బు బలం వాళ్ళదని పొంగులేటి అన్నారు. ప్రజా తీర్పులో ఎంత పెద్ద మొగోడైన తల వంచాల్సిందే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో లీడర్షిప్ ఎక్కువగా ఉంది.. ఐక్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రెండో ఆలోచన లేకుండా సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని అన్నారు. దొరల పాలన కు,ఇందిరమ్మ రాజ్యం కు మధ్యలో మనం ఉన్నామని తెలిపారు. హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి నీ గెలిపించాలని కోరారు.
Bhatti Vikramarka: సీఎం, మంత్రులు అందుబాటులో లేని సెక్రటేరియేట్ ఎందుకు..?