NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy: పార్టీ మారడం ఖాయం.. రహస్య సమావేశంలో పొంగులేటి

Ponguleti Srinivas

Ponguleti Srinivas

Ponguleti Srinivas Reddy Secret Meeting With His Followers: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా కేంద్రంలో అశ్వరావుపేట నియోజకవర్గం అనుచర వర్గంతో ఆత్మీయ రహస్య సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ సభ అనంతరం ఈ రహస్య భేటీ పెట్టిన ఆయన.. తన అనుచరులతో పార్టీ మారడం ఖాయమని పేర్కొన్నారు. అలాగే.. ఏ పార్టీలోకి వెళ్లాలో సూచించాలని కూడా అడిగారు. గ్రామాల్లో అందరితో కలివిడిగా ఉంటూ.. పార్టీ మార్పుపై చర్చించాల్సిందిగా తన అనుచరులకు సూచించారు. నాలుగేళ్ల నుంచి పార్టీలో తమకు అవమానం జరుగుతోందని, ఇకపై తామంతా ఒక గట్టి ఫోర్స్‌గా తయారవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. బీజేపీలోకి వెళ్దామని మెజారిటీ కార్యకర్తలు పొంగులేటిని సూచించినట్టు తెలిసింది. కాంగ్రెస్‌లోకి వెళ్తే.. అధికార పార్టీ ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెడుతుందని, అదే బీజేపీలోకి వెళ్తే మాత్రం భరోసాతో పాటు ధైర్యం దొరుకుతుందని అనుచరులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో పొంగులేటి మాట్లాడుతూ.. అందరు కలిసి పార్టీ మారడంపై ఓ నిర్ణయం తీసుకుందామని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల్లో 10కి 10 స్థానాలు గెలిచే విధంగా ప్లాన్ చేసుకుందామన్నారు.

Raw Mango: పచ్చి మామిడి తింటున్నారా.. ఈ లాభాలు మీ సొంతం

కాగా.. ఉమ్మడి ఖమ్మంలో బలమైన నాయకుడిగా పేరున్న పొంగులేంటి, కొంతకాలం నుంచి బీఆర్ఎస్‌పై వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు కూడా ఆయన హాజరు కాలేదు. అప్పటినుంచి ఆయన బీఆర్ఎస్‌ని వీడనున్నారా? అనే ప్రచారం మొదలైంది. ఇలాంటి తరుణంలో తన అనుచరవర్గంతో రహస్య భేటీ పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు.. బీజేపీలోకి పొంగులేటి చేరుతున్నారన్న ప్రచారం జోరుగా సాగిన తరుణంలో, బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి బీజేపీలోకి చేరే అంశంపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. తమ సిద్ధాంతం నచ్చి పార్టీలోకి వస్తే, ఎవ్వరినైనా ఆహ్వానిస్తామన్నారు. చివరగా.. పొంగులేటి ఏ పార్టీలోకి చేరుతారో చూడాలి.

Heart Health: జిమ్‌కి వెళ్లాలనుకుంటున్నారా..? ముందుగా గుండె పరీక్షలు చేయించుకోవడం మంచిది..