Ponguleti Srinivasa Reddy: కరెంటుని అడ్డం పెట్టుకొని అడ్డంగా దోచుకుంది నువ్వే.. కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కమెంట్ చేశారు. ఖమ్మం జిల్లా తిరుమల పాలెం మండలం దమ్మాయిగూడెం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ కార్నర్ మీటింగ్ మంత్రి పొంగులేటి మట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని దొంగ మాటలు అని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే ఆ రెండు పార్టీలను ఏడు లోతుల గొయ్యి తీసి పాతి పెట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. బయ్యారం ఉప్పు ఫ్యాక్టరీ విషయంలో మోసం చేసిన బీజేపీని ఎందుకు నిలదీయలేదన్నారు. బీజేపీని ప్రశ్నిస్తే జైల్లో పెడతారని భయమన్నారు. పట్ట పగులు తిట్టుకోవడం రాత్రిపూట బతిమాలు కోవటం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Ponnam Prabhakar: రైతు రుణ మాఫీ చేస్తాం.. వచ్చే వానాకాలం పంటకు 500 బోనస్ ఇస్తాం..
తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక్క సీటు రాని కేసీఆర్ నామా నాగేశ్వరాని మంత్రి ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు ఉందని చెప్పకనే చెబుతున్నా కేసిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ మంచినీళ్ల కోసం ఇబ్బంది పడొద్దన్నారు. తన నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా ఇబ్బంది పడనీయకుండా చూసుకునే బాధ్యత నాది అన్నారు. కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అంటున్న కేసీఆర్.. నువ్వు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మూడు రూపాయల యూనిట్ని 20 రూపాయితో కొన్నావని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం యూనిటీ మూడు రూపాయల 50 పైసలకే కరెంటు కొంటున్నామన్నారు. కరెంటుని అడ్డం పెట్టుకొని అడ్డంగా దోచుకుంది నువ్వే అంటూ కేసీఆర్ పై పొంగులేటి మండిపడ్డారు.
Dharmapuri Arvind: రేవంత్ రెడ్డి ఒక గుడ్డు మోసిండు… ఇంకా ఆరు గుడ్ల గురించి చెప్పలేదు