Ponguleti Srinivas Reddy Comments On His Suspension From BRS Party: బీఆర్ఎస్ పార్టీ నుంచి తనని సస్పెండ్ చేయడంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు సభ్యత్వమే లేనప్పుడు ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించిన ఆయన.. పార్టీ నుండి తనని సస్పెండ్ చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. తనను బీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని వందలసార్లు పలిచారని, అయినా తాను వెళ్లలేదని తెలిపారు. గత వంద రోజుల నుంచే బీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వ పరిపాలన తీరును తాను ప్రశ్నిస్తూనే ఉన్నానన్నారు. తనను సస్పెండ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తాను బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు చాలాసార్లు ఇబ్బందులు పెట్టినా, అవమానపర్చినా.. ఆ బాధల్ని దిగమింగుకుని ఉన్నానన్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తనకు ఎంపీ సీటు ఇవ్వకపోయినా.. కేటీఆర్ గురించే బీఆర్ఎస్‌లో ఉన్నానని స్పష్టం చేశారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఒక్క అభ్యర్థే గెలిచారన్న పొంగులేటి.. 2018 ఎన్నికలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులతో ఏనాడైనా సమీక్ష చేశారా? తొమ్మిది మంది బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమిపై చర్చించారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
KA Paul: ట్రంప్ అరెస్ట్ అవుతాడని గతంలోనే చెప్పాను.. కేఏ పాల్ హాట్ కామెంట్స్
ఒకవేళ ఓటమిపై చర్చించినట్లైతే.. ఆ సమస్యల్ని ఏ రకంగా పరిష్కరించేవారని నిలదీశారు. తప్పు మీ పక్కన పెట్టుకుని, ఫలితాలు వచ్చాక ఎదుటివారిపై నిందమోపడం ఏమాత్రం సబబు పొంగులేటి పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటినుంచి కాంగ్రెస్, కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉందని.. ఈ విషయం ఎవరిని అడిగినా చెప్తారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తుల మాటల నమ్మి.. తనని, తన వాళ్లకు పదవులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా? అని ధ్వజమెత్తారు. నామా నాగేశ్వర్ రావును ఎంపీగా గెలిపించేందుకు కూడా చాలా కృషి చేశానన్నారు. ఎన్నికలయ్యాక రాజ్యసభ సీటు ఇస్తానన్న మాటిచ్చి, ఆ తర్వాత మోసం చేశారని ఆరోపించారు. రాజకీయంగా తనని సమాధి చేయాలనుకుంటున్నారని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై పొంగులేటి ఆరోపణలు చేశారు. అయితే.. తన ఇంట్లో చివరి రక్తపు బొట్టు ఉన్నంతవరకూ ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రజల్లో గుండెల్లో ఉన్నంతవరకూ తనని ఎవరూ ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు.
Etela Rajendar: పేపర్ మాల్ ప్రాక్టీస్‌లో నా ప్రమేయం లేదని నిర్ధారించుకున్నారు..