Ponguleti Srinivas Reddy : రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మరిన్ని అడుగులు వేస్తోంది. తాజాగా మూడు కొత్త అగ్రికల్చర్ కాలేజీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని తెలిపారు. దేశంలో ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున వరి దిగుబడి రాలేదని పొంగులేటి అన్నారు.
Andhra Pradesh Train Crime: కదులుతున్న రైలులో ప్రయాణికురాలిపై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితుడు
రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మద్దతు ధరతో పాటు సన్న ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం రైతును నిజమైన రాజుగా నిలబెట్టేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇక, కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజా పాలన ఉత్సవాల నిర్వహణ కోసం సబ్‌కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా, స్థానిక సంస్థల ఎన్నికలలో ముగ్గురు పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
నల్సార్ యూనివర్సిటీకి అదనంగా 7 ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్థానికులకు 50 శాతం సీట్లు కేటాయించే ప్రతిపాదనకూ ఆమోదం లభించింది. అదే విధంగా, మెట్రోరైలు రెండో దశ 2ఎ, 2బి విస్తరణ ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలు కేంద్రానికి పంపగా, దానిపై కొర్రీలు వేసినట్లు తెలిపారు. మెట్రో విస్తరణకు ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా 5565 కిలోమీటర్ల ఆర్ అండ్ బి రోడ్ల అభివృద్ధికి ₹10,547 కోట్లు మంజూరు చేసి, హ్యామ్ మోడ్‌లో టెండర్లు ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా గుంతల మయమైన రోడ్లు మరమ్మతు కానున్నాయని తెలిపారు. అలాగే కృష్ణా – వికారాబాద్ రహదారి కోసం ₹438 కోట్లు, 835 హెక్టార్ల భూమి సేకరణకు కేటాయింపు చేశారు. మరోవైపు మున్ననూర్ – శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్‌కి ₹7,500 కోట్లు కేటాయిస్తూ 75 కిలోమీటర్ల పొడవుతో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా రంగ విస్తరణతో రాష్ట్రం ముందుకు దూసుకెళ్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Pawan Kalyan : వాళ్లను చూసి పవన్ కల్యాణ్ సిగ్గుపడ్డారు.. సమంత షాకింగ్ కామెంట్స్
