NTV Telugu Site icon

Ponguleti-Tummala: దాదాపు నాలుగేళ్ల తర్వాత.. తుమ్మల ఇంటికి పొంగులేటి..!

Pogulety Tummala

Pogulety Tummala

Ponguleti-Tummala: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కకపోవడంతో ఆ పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌ గూటికి చేర్చేందుకు ఆ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో తుమ్మలను కలిసిన రేవంత్‌రెడ్డి, ఇతర నేతలు కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. కాగా, ఇటీవల కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం ఉదయం ఖమ్మంలోని తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లారు. అయితే ఈ ఇద్దరు నేతలు బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటికీ బహిరంగంగా పలకరించుకున్న దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు మారిన సమీకరణాల నేపథ్యంలో పొంగులేటి తుమ్మల నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం ఆప్యాయంగా పలకరించుకోనున్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా పొంగులేటి సోదరులను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

Read also: Bihar: మహిళపై వేధింపులు.. అరగుండు, మెడలో బూట్ల దండతో ఊరేగింపు

ఈ భేటీ అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. తుమ్మల నాగేశ్వరరావు సీనియర్‌ నాయకుడని, అపార రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని అన్నారు. ఏ పార్టీ పెట్టినా ప్రజల కోసమే చిత్తశుద్ధితో పని చేశానన్నారు. బీఆర్‌ఎస్‌లో తనను అవమానించి పొగబెట్టారని అన్నారు. మొదట తనను బయటకు పంపించి.. ఇప్పుడు తుమ్మిళ్లే చేశారని విమర్శించారు. తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఆయన మిత్ర బృందాన్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఇది తుమ్మల నాగేశ్వరరావు ఒక్కరే తీసుకున్న నిర్ణయం కాదన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనకు చిరకాల మిత్రుడని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తాను ఏ రంగంలో ఉన్నా ప్రయోజకుడినని.. తనకు కూడా శ్రేయోభిలాషి అని అన్నారు. ప్రజల జీవితాలు బాగుపడేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. జిల్లాను అభివృద్ధి చేస్తూ ముందుకు సాగామన్నారు. 40 ఏళ్లుగా జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశానన్నారు. కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా పొంగులేటి తనను ఆహ్వానించారని తెలిపారు. సీతారామ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు విడుదలయ్యేలా చూడడమే తన లక్ష్యమన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని.. అందరి అభిప్రాయాలను పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయాలను ప్రకటిస్తామన్నారు.
Prabhas: యాడ దొరికిన సంతరా ఇది… సంపేత్తే సంపేయండి కానీ టెన్షన్ పెట్టకండి

Show comments