Telangana: అలర్ట్.. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఎక్కడ కనిపించినా సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana: ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువయ్యాయి. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని కొందరు చైన్ స్నాచర్లు మెడలో వస్తువులు కట్టేస్తున్నారు. ఒక్కోసారి మహిళలు తీవ్రంగా గాయపడడమే కాదు.. మృత్యువాత పడుతున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వారిని పట్టుకోవాలంటే పోలీసులకు నెంబర్ ప్లేట్లు చాలా ముఖ్యం. అయితే ఇటీవల ఇలాంటి సందర్భాల్లో సీసీ కెమెరాలను పరిశీలించగా చాలా మంది నంబర్ ప్లేట్ లేని వాహనాలను నడుపుతున్నట్లు తేలింది. కాగా.. దొంగలు నడిపే బైక్స్, కార్ల నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేస్తు.. అర్థం కాని నెంబర్ల ఉపయోగిస్తున్నారు. దీంతో దొంగలను పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.
Read also: Whatsapp : వాట్సాప్ లో నెంబర్ సేవ్ చెయ్యకుండా మెసేజ్ చెయ్యొచ్చు.. ఎలాగంటే?
Also Read
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
- Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
- Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..
ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఎక్కడపడితే అక్కడ సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సైఫా బాద్ పోలీసులు చేపట్టిన డ్రైవ్‌లో నంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేశారు. తొలిరోజు 20కి పైగా బైక్‌లను సీజ్ చేశారు. కొత్త నంబర్ ప్లేట్లను బిగించిన తర్వాతే వాహనాలను యజమానులకు తిరిగి ఇచ్చేశారు. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిలో యువతే ఎక్కువని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అప్రమత్తం చేయాలని కోరారు. నెంబర్ ప్లేట్ తారుమారు చేసినా, స్టిక్కర్లు కనిపించకున్నా బండిని సీజ్ చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం.. అదే దారిలో వెండి.. ఎంతంటే?
తాజావార్తలు
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!