Site icon NTV Telugu

Telangana: అలర్ట్‌.. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఎక్కడ కనిపించినా సీజ్

No Number Plaet

No Number Plaet

Telangana: ఇటీవల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువయ్యాయి. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని కొందరు చైన్ స్నాచర్లు మెడలో వస్తువులు కట్టేస్తున్నారు. ఒక్కోసారి మహిళలు తీవ్రంగా గాయపడడమే కాదు.. మృత్యువాత పడుతున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వారిని పట్టుకోవాలంటే పోలీసులకు నెంబర్ ప్లేట్లు చాలా ముఖ్యం. అయితే ఇటీవల ఇలాంటి సందర్భాల్లో సీసీ కెమెరాలను పరిశీలించగా చాలా మంది నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలను నడుపుతున్నట్లు తేలింది. కాగా.. దొంగలు నడిపే బైక్స్, కార్ల నెంబర్ ప్లేట్ కనిపించకుండా చేస్తు.. అర్థం కాని నెంబర్ల ఉపయోగిస్తున్నారు. దీంతో దొంగలను పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.

Read also: Whatsapp : వాట్సాప్ లో నెంబర్ సేవ్ చెయ్యకుండా మెసేజ్ చెయ్యొచ్చు.. ఎలాగంటే?

ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను ఎక్కడపడితే అక్కడ సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో సైఫా బాద్ పోలీసులు చేపట్టిన డ్రైవ్‌లో నంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేశారు. తొలిరోజు 20కి పైగా బైక్‌లను సీజ్ చేశారు. కొత్త నంబర్ ప్లేట్లను బిగించిన తర్వాతే వాహనాలను యజమానులకు తిరిగి ఇచ్చేశారు. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిలో యువతే ఎక్కువని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అప్రమత్తం చేయాలని కోరారు. నెంబర్ ప్లేట్ తారుమారు చేసినా, స్టిక్కర్లు కనిపించకున్నా బండిని సీజ్ చేస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
Gold Price Today : స్వల్పంగా పెరిగిన బంగారం.. అదే దారిలో వెండి.. ఎంతంటే?

Exit mobile version