NTV Telugu Site icon

Ex MLA Son Case: మాజీ ఎమ్మెల్యే కొడుకును తప్పించి మరోకరిపై కేసు.. బయటపడుతున్న పంజాగుట్ట పోలీసుల నిర్వాకం

Ex Mla Son Case

Ex Mla Son Case

మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు సోహైల్ కేసు మలుపు తీరుగుతున్నాయి. నిన్నిటి వరకు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సోహైల్ స్థానంలోకి మాజీ ఎమ్మెల్యే పని మనిషి వచ్చాడు. ఈ కేసు నుంచి సోహైల్‌ను తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యేతో కలిసి పంజాగుట్ట పోలీసులు కుట్ర పన్నినట్టుగా విచారణలో వెల్లడైంది. కాగా గత ఆదివారం అర్థరాత్రి మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు సోహైల్ ప్రజా భవన్ వద్ద కారుతో బీభత్సం సృష్టించాడు. అతివేగంతో దూసుకొచ్చి ప్రజా భవన్ ముందున్న బారికేడ్లను ఢీకొట్టడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Bhatti Vikramarka: ప్రధానితో భేటీ.. తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించాం

ఆ సమయంలో సోహైల్ మద్యం తాగి కారు నడిపినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అరెస్ట్ అయిన కొడుకు కోసం మాజీ ఎమ్మెల్యే షకిల్ రాత్రి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు రావడంతో ఇప్పుడు ఈ కేసు రాజకీయంగా మలుపు తిరిగింది. షకిల్ స్టేషన్ వచ్చి వెళ్లిన అనంతరం ఈ కేసులో సోహైల్‌ను తప్పించి మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పని మనిషిని పోలీసులు కేసులో నిందితుడిగా చేర్చారు. దీంతో ఈ యాక్సిడెంట్ వ్యవహారం రాజకీయాలకు దారితీస్తుండటంతో సమగ్ర దర్యాప్తు జరిపి తనకు నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. సోహైల్ అరెస్ట్ అనంతరం మాజీ ఎమ్మెల్యే పోలీసు స్టేషన్‌కు వచ్చి వెళ్లినట్టు సీసీటీవీలో రికార్డయింది.

Also Read: Law Student Arrest: మాజీ ప్రియుడిపై పగ.. కారులో గంజాయి పెట్టి అరెస్ట్ చేయించిన లా స్టూడెంట్

దీంతో ఆ సమయంలో డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్రపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు జరగుుతన్న క్రమంలో ఇన్‌స్పెక్టర్ దుర్గారావు అస్వస్థకు గురైనట్టు సమాచారం. బీపీ పెరిగిపోవడంతో అధికారులు ఆయనను ప్రవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. సోహైల్‌తో రాత్రి కాల్స్ మాట్లాడిన స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు. కాగా గతంలోనూ సోహైల్‌ను ఓ రోడ్డు ప్రమాదం కేసులో తప్పించినట్టు విచారణలో తేలింది. రోడ్ నెం 45లో సోహైల్ రోడ్డు ప్రమాదం చేయగా.. ఈ ఘటన ఇద్దరు చనిపోగా..మరొకరు ఇప్పటికీ చావుతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రమాదంలో కూడా మాజీ ఎమ్మెల్యే తన కొడుకు సొహెల్ తప్పించి మరొకరిని కేసులో చేర్చారు.